Aam Aadmi Party: ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో పాదయాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్‌లో విజయం సాధించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో మరింత జోష్ పెరిగింది.. ఇక, ఇప్పటికే తెలంగాణలో రాజకీయ నేతలు పాదయాత్రలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.. మరికొన్ని పాదయాత్రలు కూడా ప్రారంభం కాబోతున్నాయి.. మరోవైపు.. ఇప్పుడు తెలంగాణలో ఆమ్ఆద్మీ పార్టీ కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైంది.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల పై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుందని ప్రకటించారు.. అందులో భాగంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి తెలంగాణలో పాదయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు..
Read Also: AP: కేబినెట్ విస్తరణపై జగన్ క్లారిటీ.. వాళ్లకే అవకాశం..!
Also Read
ఈ పాదయాత్ర ద్వారా ఆమ్ ఆద్మీ పథకాలను ఇంటి ఇంటికి తీసుకెళ్తామని తెలిపారు సోమనాథ్ భారతి.. ఇక, తొలగించిన ఫెల్డ్ అసిస్టెంట్లకు రెండేళ్ల జీతం కట్టించాలని డిమాండ్ చేసిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. వారికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని సూచించారు.. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా విధుల నుంచి బహిష్కరించిందని మండిపడ్డ ఆయన.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ అంశంపై మాట్లాడలేదని విమర్శించారు.. ఆమ్ఆద్మీ పార్టీ.. ఫీల్డ్ అసిస్టెంట్స్ కోసం పోరాడిందని తెలిపారు. ఇక, ఫీల్డ్ అసిస్టెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం పంపుతున్న నిధులను సీఎం కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించిన సోమనాథ్ భారతి.. ఆ నిధులు దుర్వినియోగం పై కేంద్ర డెవెలప్మెంట్ సెక్రటరీకి లేఖ రాసినట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!