Warangal: కన్నీటి సంద్రంలో రైతన్న.. చెత్తకుప్పకు చేరిన లక్షలు విలువ చేసే టమాటా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: రైతులకు ఉల్లి, టమాటా సాగు అధిక రిస్క్‌తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ పంటల సరఫరా విషయంలో ఎప్పుడూ అనిశ్చితి ఉంటుంది. ఈ పంట సాగుకు అయ్యే ఖర్చుకు, కోతకు వచ్చే ఖర్చుకు వ్యత్యాసం చాలా ఉంటుంది. దీంతో ఈ సరుకులను మార్కెట్ కమిటీకి తీసుకెళ్లకుండా రైతులు పలుమార్లు ఉల్లి, టమాటాలను రోడ్డుపై పడేసిన రోజులు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం రైతుల పంట పండింది. టమాటాల ధర మోతమోగింది. ఈ పంట ద్వారా రైతులు చాలామంది కోటీశ్వరులయ్యారు. మరికొందరు రైతులు కన్నీరు పెట్టుకుట్టున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు టమోటా కుళ్లిపోయి చెత్తకు చేరడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిన టమాటా ఇప్పుడు వరంగల్ లక్ష్మీపురం మార్కెట్ లోని చెత్తకుప్పకు చేరింది.
Read also: Crying Record: ఏడుపు రికార్డే.. తీరా చూస్తే..
Also Read
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
భారీ వర్షాలకు తోడు.. అధిక ధరల కారణంగా విక్రయాలు తగ్గిపోవడంతో టమాట వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. కొద్ది రోజులుగా పెరిగిన టమాటా ధర సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. టమోటా ధరలు పెరగడంతో రైతులు లక్షల్లో ఆర్జించిన వార్తలను కూడా చూస్తున్నాం. ఎంత రేటు పెరిగినా టమాటకు ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్నారు వరంగల్ లోని టమాట వ్యాపారులు. మదనపల్లి, కర్ణాటక మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున టమోటాలు తెప్పించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మార్కెట్ కు వచ్చే వారి సంఖ్య తగ్గింది. పైగా అధిక ధరల కారణంగా సామాన్యులు టమాటా కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో టమోటాలు పెద్ద ఎత్తున కుళ్లిపోయాయి. దీంతో చేసేదేమీ లేక అవన్నీ తీసుకొచ్చి చెత్తకుండీలో పడేశారు. భారీ పెట్టుబడితో తెచ్చిన టమోటాలు వర్షం కారణంగా ఒక్కరోజులోనే దెబ్బతిన్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Rohit Sharma: ఎంఎస్ ధోనీని అధిగమించిన రోహిత్ శర్మ!
తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..