Hyderabad Central University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హత్యాచారయత్నం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాత్రి 8 గంటలకు క్యాంపస్ నుంచి బాధిత విద్యార్థిని బయటికి వచ్చింది. హిందీ బేసిక్స్ నేర్పిస్తానంటూ బాధిత విద్యార్థిని ప్రొఫెసర్ రవి రంజన్ కార్ లో తీసుకెల్లారని సమాచారం. నేరుగా విద్యార్థిని, ప్రొఫెసర్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో బాధిత యువతకి ప్రొఫెసర్ రవి రంజన్ మద్యం తాగించాడు. అనంతరం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేశాడు. భాదిత యువతి ప్రతికరించడంతో రవి రంజన్ ఆమెను కొట్టినట్లు సమాచారం. తిరిగి బాధిత యువతని స్వయంగా కారులో తీసుకువచ్చిన ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీ గేటు దగ్గర వదిలిపెట్టినట్టడంతో.. ఆ విద్యార్థిని నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు వెళ్లి ప్రొఫెసర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రొఫసర్ కామలీలలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ప్రొఫెసర్ రవి రంజన్ పై మూడు కేసులు నమోదైనట్లు చెప్పారు పోలీసులు. గత నెల రోజుల క్రితం రవి రంజన్ ఉమెన్ ఎంపవర్మెంట్ పై ఉపన్యాసం ఇచ్చి ఇలా ప్రవర్తించాడంతో ప్రొఫెసర్ తీరుపై విద్యా్ర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నమోదైన కేసులపై చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ ఘటన చోటుచేసుకుని ఉండేది కాదని విద్యార్థులు అంటున్నారు.
Read also: Badruddin Ajmal: హిందువులు పెళ్లికి ముందు రెండు, మూడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు..
వెంటనే ప్రొఫెసర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధిత యువతిని ఆసుపత్రికి తీసుకుని వెళుతున్నారని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నడుమ యువతిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. బాధిత యువతి నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు పోలీసులు. అయితే.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సస్పెండ్ చేశారు అధికారులు. హిందీ ప్రొఫెసర్ రవి రంజన్ ను సస్పెండ్ చేసిన యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోలీసులు వచ్చారు. విద్యార్థులతో పోలీస్ అధికారులు మాట్లాడుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని ప్రొఫెసర్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు విద్యార్థులకు చెప్తున్నారు. అయితే యూనివర్సిటీ తీరుపై విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులతో పోలీసులు మాట్లాడుతున్నారు. మరి వీటిపై పోలీసులు, యూనివర్సిటీ అధికారులు ఏవిధంగా మంతనాలు జరుపనున్నారు అనేది ఉత్కంఠంగా మారింది.