Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News A Poor Man Who Is Troubled By The Rich People In Hyderabad

Hyderabad Traffic: ఉన్నోడి వల్ల ఇబ్బంది పడుతున్న పేదోడు

Published Date :July 9, 2022 , 4:04 pm
By Ramesh Nalam
Hyderabad Traffic: ఉన్నోడి వల్ల ఇబ్బంది పడుతున్న పేదోడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఒళ్లు కాలి మరొకడు ఏడ్చాడని వెనుకటికి ఒక సామెత ఉంది. ఇప్పుడు ఈ సామెత హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్‌కు సరిగ్గా సరిపోతుంది. ఉన్నోడు కార్లలో తిరుగుతూ ట్రాఫిక్‌ జామ్‌లకు కారణమవుతుంటే.. లేనోడు బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తూ ట్రాఫిక్‌జామ్‌లలో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నాడు. ట్రాఫిక్‌జామ్‌కు భారీ వర్షాలే కారణమని వాదించవచ్చు. కానీ అది 30 శాతం మాత్రమే. మిగతా 70 శాతం నానాటికీ పెరుగుతున్న కార్ల ట్రాఫిక్‌ను ప్రభుత్వాధికారులు అదుపు చేయలేకపోవడం కూడా కారణమే అన్న వాదనలు లేకపోలేదు.

Read Also: Congress: ఆగస్టు మొదటివారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ

ఒక్కరి కోసం కారు.. దర్పం కోసమేనా?
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ను పరిశీలిస్తే గత రెండేళ్లుగా అంటే కరోనా తర్వాత చేతిలో కాస్త డబ్బులుంటే చాలు కారు కొనుగోలు చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. సౌలభ్యం కోసం కారు కొనుగోలు చేయడంలో తప్పు లేదు. కానీ ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు రోడ్డుకు చాలనంత కారును కొనుగోలు చేసి సామాన్యులను ఇబ్బంది పడేలా చేయడమే తప్పు. ప్రస్తుతం కారు డ్రైవింగ్ చేసే వాళ్లలో 100 శాతం డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. సరిగ్గా డ్రైవింగ్ రాకుండానే రోడ్డు మీదకు కారును తీసుకువెళ్లి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేవాళ్లు చాలామందే ఉన్నారు.

అప్పుడు సిగ్నళ్లు.. ఇప్పుడు యూటర్నులు
ఒకప్పుడు నగరంలో జంక్షన్‌ల వద్ద రెడ్ సిగ్నల్ పడితే కిలోమీటర్, రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించేది. కానీ ఇప్పటి ప్రభుత్వం ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పలుచోట్ల సిగ్నళ్లు తొలగించి యూటర్నులు ఏర్పాటు చేసింది. అయితే కారు డ్రైవింగ్ సరిగ్గా రాకపోవడం కారణంగా చాలా మంది యూటర్నుల వద్ద తమ వాహనాలతో ఇక్కట్లకు గురవుతున్నారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ వంటి నగరాల్లో పొల్యూషన్‌ను కంట్రోల్ చేసేందుకు సరి, బేసి విధానంలో వాహనాలను అనుమతిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా ట్రాఫిక్ భారీ స్థాయిలో ఉంటుందంటే.. ఒకవేళ ఐటీ ఆఫీసులన్నీ ఓపెన్ చేస్తే ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి భయం వేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Heavy rains
  • hyderabad
  • Hyderabad traffic
  • Poor People
  • rich persons

తాజావార్తలు

  • Supreme Court: ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరు.?.. బెంగాల్ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

  • Biker: శర్వా ‘బైకర్’ జోరు.. తొలి వీకెండ్ లోనే రూ. 18 కోట్ల వసూళ్లు!

  • Paytm New Feature: పేటియం అదిరిపోయే అప్‌డేట్.. కార్డ్ లేకుండానే డబ్బులు! ఎలాగో చూసేయండి..

  • Rakasa: దూసుకుపోతున్న రాకాస.. మూడు రోజుల్లో షాకింగ్ కలెక్షన్స్

  • Big Alert: హైదరాబాద్‌ శివారులో ఇల్లు కొనుగోలు చేసే వారికి బిగ్ అలర్ట్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions