Stephen Raveendra: నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో బ్యాంకులు నుండి రుణాలు ఇప్పిస్తున్న 18 ముఠాను అదుపులో తీసుకున్నామని అన్నారు. భారీగా ఫేక్ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, సర్టిఫికెట్లను పొంది వాటి ద్వారా బ్యాంకులో రుణాలు తీసుకుంటున్న ముఠాను పట్టుకున్నామని అన్నారు. మొత్తం పది కోట్ల రూపాయల విలువైన సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 687 రబ్బర్ స్టాంపులు, 1180 ఫేక్ సర్టిఫికెట్లు, 10 ల్యాప్‌టాప్ లు, 57 సెల్‌ఫోన్లు, స్టాంప్ మేకింగ్ మెషీన్లు, స్టాంప్ ఫ్లాషర్స్ లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ హౌస్ పర్మిషన్ సర్టిఫికెట్లను సైతం ఈ ముఠా ఇస్తుందన్నారు. కుకట్‌పల్లి, కేపిహెచ్‌బి లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎస్ఓటీ ఈ ముఠా గుట్టురట్టు చేసిందని వెల్లడించారు.
Read also: MLA Raja Singh: కలిసి సినిమా చూద్దాం రండి.. కేటీఆర్ కు రాజాసింగ్ ఆహ్వానం
ఈ ముఠాకు ప్రధాన నిందితుడు రంగారావు అని, రంగారావు ఈ సర్టిఫికెట్లను తయారు చేస్తాడని తెలిపారు. బ్యాంకులు నుండి రుణాలు ఇప్పిస్తాడని, 2005, 2012 లో అరెస్టు అయ్యాడని వెల్లడించారు. 2015 నుండి ఈ ముఠా నడుస్తుందని, మొత్తం మూడు టీమ్ లు పని చేస్తాయని తెలిపారు. ఫేక్ రబ్బర్ స్టాంపులు తయారు చేయడం ఒక ముఠా, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర తదితర బ్యాంకులు నుండి రుణాలు తీసుకుంటున్నారని అన్నారు. మరో ముఠా బిజినెస్ లోన్ లు ఇప్పిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని అన్నారు. లేబర్ లైసెన్స్, జీహెచ్ఎంసీ ట్రేడ్ సర్టిఫికెట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ లను తయారు చేస్తున్నారని తెలిపారు. వీటి ద్వారా బిజినెస్ లోన్లు ఇప్పిస్తున్నారని, ఫేక్ లే అవుట్ కి మూడు వేలు, బ్యాంకు రుణాలు కోసం సర్టిఫికెట్లను ఇప్పించేందుకు ఐదు వేలు తీసుకుంటున్నారని అన్నారు. బ్యాంకుల సిబ్బంది పాత్ర పై ఆరా తీస్తున్నామని తెలిపారు. వాళ్ళ పాత్రపై ఆధారాలు దొరికితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు పాత్రపై ఆరా తీస్తామని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
Prabhas: యుద్ధానికి సిద్ధమవ్వండి… డైనోసర్ ట్రైలర్ వస్తుంది