MLA Raja Singh: కలిసి సినిమా చూద్దాం రండి.. కేటీఆర్ కు రాజాసింగ్ ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Raja Singh: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రజాకార్ సినిమా టీజర్ రాజకీయ వివాదాలకు వేదికగా మారింది. ఈ సినిమాపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించిన విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ ట్వీట్ కు రాజాసింగ్ స్పందించారు. మీరు, మేము కలిసి (రాజాకార్) సినిమా చూద్దాం రండి అంటూ కేటీఆర్ కు ఎమ్మేల్యే రాజాసింగ్ ఆహ్వానం పలికారు. టీజర్ కే భయపడి నిజాం వారసులు ఏదేదో కామెంట్ చేస్తున్నారని వ్యంగాస్త్రం వేశారు. ట్విట్టర్ మెన్ సెన్సార్ బోర్డ్ కి, పోలీసులకు లేఖ రాస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. బీజేపీ జోకర్ కాదు.. హీరో అంటూ తెలిపారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ అరాచకాల గురించి మీ నాన్న మీకు చెప్పలేదా? అంటూ ప్రశ్నించారు. మూవీ చూసిన తర్వాత సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో డిసైడ్ అయితే బాగుంటుందని కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో రిలీజ్ చేశారు.
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలై వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. 1948లో నిజాం ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. పోలీసుల చర్యగా… ముస్లింలు పెద్ద నేరస్తులన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ టీజర్ చూసిన నెటిజన్లు, మత పెద్దలు, రాజకీయ పార్టీల నేతలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమా తీశారని విమర్శించారు. రాజకీయాల కోసం తప్పుడు సినిమాలు తీస్తే జనం నమ్మరని పేర్కొన్నారు. కాగా, ఇదే అంశంపై తాజాగా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. “కొందరు తెలివి విషయంలో దివాళా తీసిన బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణలో మత విద్వేషాలు సృష్టించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని, రజాకార్ సినిమా విషయాన్ని సెన్సార్ బోర్డు దృష్టికి తీసుకెళ్తాం.. శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా తెలంగాణ పోలీసులు కూడా చూసుకుంటారు అని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో.. బండి సంజయ్, రాజాసింగ్ స్పందించడంపై ఆశక్తి నెలకొంది.
Also Read
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
Some intellectually bankrupt jokers of the BJP are doing their best to instigate communal violence and polarisation for their political propaganda in Telangana
We will take up the matter with censor board and also the Telangana police to ensure that the law & order situation of… https://t.co/a7DETpVGKP
— KTR (@KTRBRS) September 18, 2023
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!