Fire Accident: హైదరాబాద్ లో అగ్నిప్రమాద ఘటనలు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా జేపీ పెయింట్స్ ఘటన మరవక ముందే నాచారం పీఎస్ పరిధిలో మరో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని ఏకశిలా రసాయన కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అందులో వున్న కార్మికులు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీసారు. అగ్నిప్రమాదంతో విషవాయువులు వెలువడి పలువురు కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
కాగా.. అందులో పనిచేసే కార్మికులకు అమోనియో విష వాయువు పీల్చుకుని స్వస్థతకు గురయ్యారని తెలిపారు. ప్రాణాంతకమైన అమోనియోను కంపెనీలో ఎలా వాడుతారని స్థానికుల మండిపడ్డారు. కంపెనీకి పర్మిషన్ ఉన్నాదా? లేదా? అని స్థానిక కంపెనీవాసులపై అనుమానం వ్యక్తం చేశారు. శ్రామిక వాడ ఉన్నత అధికారులు స్పందించి ఏకశిలా కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటన గల కారణాలను తెలుసుకుంటున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ఎలా సంభవించింది అని ఆరా తీస్తున్నారు. అస్వస్థతకు గురైన కార్మికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే నాచారంలోనే వారంరోజులు తిరగకముందే మరో ఘటన చోటుచేసుకోవడంపై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నా ఇలాంటి విషవాయువులున్న కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కంపెనీ చుట్టూ పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జేపీ పరిశ్రమల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అగ్నిప్రమాదంతో అల్లాడిపోతున్నారు. కానీ హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇటీవల సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఐదో అంతస్తులో ఐదుగురు మృతి చెందగా, శివ అనే మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Sri Ganesha Sahasranama Stotram: చైత్రమాసం, బుధవారం నాడు ఈ స్తోత్రాలు వింటే సర్వ సంపదలు కలుగుతాయి