అప్పుల బాధులు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. పంటకోసం అప్పుల చేసే రైతన్నలు ఉరితాడులకు వేలాడుతున్నారు. అన్నం పెట్టే రైతే ..ఆవేదనకు గురై అప్పు తీర్చలేక..పంటను అమ్ముకోలేక, కుంటుంబాన్ని పోషించుకునే స్థోమత లేక, కన్నీటి వ్యధ చెప్పుకోలేక కడుపుకోతతో తనకు తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ఉరితాడే మెడతాడులా వాడి ఊపిరిని బిగించుకుంటున్నారు. ఇలాంటి కన్నీటి ఘటనలే ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వ్యవసాయం కోసం తెచ్చిన అప్పుల భారం పెరిగి ఒక్కరు ఉరేసుకొని బలవన్మరణంకు పాల్పడితే మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ఖడ్కి గ్రామానికి చెందిన మడావి మారు అనే రైతు ఉరేసుకొని మృతి చెందగా.. కొమరంభీం జిల్లా కెరమెరి మండలం తుమ్మగూ డకు చెందిన రాథోడ్ మోహన్ అనే రైతు అప్పుల బాధ తో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు రైతుల ఆత్మ హత్య ఆ రెండు కుటుంబాల లో విషాదాన్ని నింపింది.
కాగా.. ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లా 2022 మే 21న చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం పీఎన్ పాల్యం గ్రామానికి చెందిన రైతు పీవీ శ్రీరంగప్ప కు నాలుగు ఎకరాల పొలం ఉంది. పెట్టుబడులకు రూ.16 లక్షలు అప్పు చేశాడు. అప్పుతీర్చే మార్గంలేక దిక్కుతోచని స్థితిలో శనివారం తెల్లవారుజామున ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని నెరమెట్ల గ్రామానికి చెందిన నర్సిరెడ్డి అనే రైతు సొంత పొలానికి తోడు కొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయం కోసం చేసిన రూ.16 లక్షలు అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర ఒత్తిడికి లోనై పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కుటుంబాల్లో తీరని సోకం మిగిల్చాయి. లక్షల్లో అప్పులు, కొనలేని పంటలు, గిట్టుబాటు ధరలు లేక, రైతన్న ఆవదేనతో అప్పులు తీర్చలేక పోలంలోనే తన పెంచుకున్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. అన్నం పెట్టే రైతన్నకు ఆదుకునే దిక్కెవరంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Indrakaran Reddy: గ్రామస్తులతో కలిసి ఆటలాడిన మంత్రి