Tragedy in TET Exam: టెట్ పరీక్షా కేంద్రంలో విషాదం.. 8 నెలల గర్భిణి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy in Tet exam: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. పరీక్ష హాళ్లలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొత్తం 1,139 పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపర్-1 పరీక్షకు 1,139 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్-2 పరీక్షకు 913 పరీక్షా కేంద్రాల్లో 2,08,498 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన టెట్ ఎగ్జామ్ లో విషాదం చోటుచేసుకుంది. సమయం కంటే ముందే హాజరు కావాలని 8నెలల నిండు గర్భణీ ఎగ్జామ్ రాసేందుకు పరుగెత్తుకుంటూ వచ్చి ఎగ్జామ్ హాల్లో కుప్పకూలిపోయింది. స్పందించిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read also: Ponnala Lakshmaiah: జనగామ నుంచే పోటీ చేస్తా… జనగామలోనే చస్తా..
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
గచ్చిబౌలిలో అరుణ్, రాధిక నివాసం ఉంటున్నారు. రాధిక 8 నెలల గర్భవతి. రాధిక టెట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతుంది. అయితే ఇవాళ టెట్ ఎగ్జామ్ ఉండటంతో సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు భర్త అరుణ్ తో కలిసి రాధిక వెళ్లింది. పరీక్షకు వెళ్లే తొందరలో తను ఎనిమిది నెలల గర్భవతి అనే సంగతి మరిచింది. పరిగెత్తుకుంటు పరీక్షా గదికి చేరుకుంది. తన సీటులో కూర్చొంది ఇంతలోనే రాధికకు బీపీ ఎక్కువై, చెమటలొచ్చి పరీక్షా గదిలోనే రాధిక పడిపోయింది. అక్కడున్న విద్యార్థులందరూ భయాందోళనకు గురయ్యారు. రాధిక పడిపోవడం ఉపాధ్యాయులకు చెప్పడంతో రాధికపై నీళ్లు చెల్లిన ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడే ఉన్న పోలీసులకు, యాజమాన్యానికి చెప్పడంతో వెంటనే రాధికను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రాధికను వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. రాధిక మృతితో భర్త అరుణ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన తన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జామ్ హాల్ కు తొందరగా వెళ్లాలనే టెన్షన్ తోనే ఇలా జరిగిందని వాపోయాడు. తన భార్యను కోల్పోయానని వాపోయాడు.
Almonds: నానబెట్టిన బాదంనే ఎందుకు తినాలో తెలుసా?
తాజావార్తలు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!