NTV Telugu Site icon

Devadula Pump House: దేవాదుల పంప్ హౌస్ చోరీ కేసు.. అదుపులో 5 మంది..

Devadula Pump House

Devadula Pump House

Devadula Pump House: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల పంప్‌హౌస్‌లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు 5 మందిని అదుపులో తీసుకున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పాప్కాపూర్ క్రాస్ రోడ్ వద్ద పోలీసుల వాహన తనికీలు చేపట్టారు.
రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. దేవాదుల పంపు హౌస్ లో సిబ్బందిని బెదిరించిన కాపర్ వైర్ ఎత్తుకెళ్లిన దుండగులుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లు, 50 కేజీల కాపర్ వైర్, మొబైల్ ఫోన్స్ ఆరు, ఒక కత్తి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు.

Read also: Bengal Governor: బెంగాల్ గవర్నర్ పై మహిళ లైంగిక ఆరోపణలు.. సీసీటీవీ ఫుటేజీ విడుదల

గత నాలుగురోజుల కిత్రం (మంగళవారం) దేవాదుల పంప్ హౌస్ లో ఆగంతకులు చొరబడ్డారు. అర్ధరాత్రి ద్విచక్రవాహనాలపై పంప్ హౌస్ వద్దకు వచ్చిన అగంతకులు పంప్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని కత్తులతో బెదిరించారు. అనంతరం పంప్‌హౌస్‌లోకి చొరబడి విలువైన రాగి తీగ, ఇతర సామగ్రిని తీసుకెళ్లారు. పంప్ హౌస్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డును కత్తులతో బెదిరించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పంప్ హౌస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలించారు. కన్నాయిగూడెం మండలం దేవాడ పంపాజ్‌లో జరిగింది. అర్ధరాత్రి ద్విచక్రవాహనాలపై వచ్చిన అగంతకులు పంప్‌హౌస్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద సెక్యూరిటీని కత్తులతో బెదిరించారు.

పాంపౌజ్‌లోకి చొరబడి విలువైన రాగి తీగ, ఇతర వస్తువులను దోచుకెళ్లారు. అర్ధరాత్రి పంప్ హౌస్ వద్ద నిద్రిస్తున్న సిబ్బందిని ఐదుగురు గుర్తుతెలియని దుండగులు లేపి కర్రలు, కత్తులతో బెదిరించారు. ఇద్దరు దుండగులు బెడ్‌పై నుంచి సిగరెట్‌ తీసి కాల్చారు. అనంతరం పంప్‌హౌస్‌కు తరలించి అక్కడి నుంచి విలువైన వస్తువులను తీసుకెళ్లారు. ఫిర్యాదు మేరకు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఈ ముఠా కోసం వేట ప్రారంభించి ఎట్టకేలకు నిందితులను పట్టకుని రిమాండ్ కు తరలించారు.
Election Campaign: ప్రచారానికి ఇంకా 2 రోజులే.. దూకుడు పెంచిన పార్టీలు