ఈనెల 29న (ఆదివారం) ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుండడంతో పలు మార్గాల్లో 34 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. లింగంపల్లి-హైదరాబాద్ స్టేషన్ల మధ్య 18 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి 14, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2 చొప్పున సర్వీసులు రద్దయ్యాయి.
రద్దయిన మార్గాల్లో సిటీ బస్సులు
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయిన మార్గాల్లో అదనంగా సిటీ బస్సులు నడుపాలని అధికారులు నిర్ణయించారు. కేశవగిరి నుంచి బోరబండ వరకు (22), సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ (54), సికింద్రాబాద్ నుంచి బోరబండ (16), చాంద్రాయణగుట్ట నుంచి పటాన్‌చెరు (108), సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు (84) వరకు అదనపు బస్సులు నడుస్తాయని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ యాదగిరి తెలిపారు.
ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రావడం.. కొద్ది సమయంలోనే గమ్యస్థానానికి చేరడంతో.. ప్రతి ఒక్క ప్రయాణికులు మెట్రోకే పరుగులు పెడుతున్నారు. రెండు మూడు స్టాపుల్లోనే గమ్యం రావడంతో ప్రయాణికులు మెట్రోకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎంఎంటీఎస్ కు ప్రయాణికులు తగ్గారని నగరవాసుల టాక్.. ఉదయం 6 గంటల నుంచి మెట్రో అందుబాటులో వుండి రాత్రి 11 గంటలకు మెట్రో సేవలందించడంతో ప్రయాణికులంతా మెట్రోలో ప్రయాణించేందుకే ఆసక్తి చూపిస్తునట్లు తెలుస్తోంది. దీంతో ఎంఎంటీఎస్ కు రద్దీ తక్కువైందని పలువురు భావిస్తున్నారు. దీనివల్లే ఎంఎంటీఎస్ ప్రయాణికులు తగ్గారని దీనివల్లే ఎంఎంటీఎస్ రైళ్లు రద్దైనట్లు తెలుస్తోంది.
రద్దైన రైళ్లు ఇవే..
లింగంపల్లి- హైదరాబాద్ మధ్య నడిచే 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140 నెంబర్ల రైళ్లు రద్దయ్యాయి.
హైదరాబాద్ లింగంపల్లి మధ్య 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 సర్వీసులను రద్దు చేశారు.
ఫలక్నుమా – లింగంపల్లి మధ్య 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నెంబర్ల రైళ్లు నేడు అందుబాటులో ఉండవు.
లింగంపల్లి – ఫలకూమా మధ్య 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192 రైళ్లను రద్దు చేశారు.
కింద్రాబాద్ – లింగంపల్లి మధ్య 47150 సర్వీసు నేడు అందుబాటులో ఉండదు.
లింగంపల్లి – సికింద్రాబాద్ మధ్య 47195 సర్వీసును రద్దు చేశారు.
Gold Hallmark: ఆభరణానికి హాల్‌మార్క్! జూన్ 1 నుంచి అమలు