ఈనెల 29న (ఆదివారం) ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుండడంతో పలు మార్గాల్లో 34 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. లింగంపల్లి-హైదరాబాద్ స్టేషన్ల మధ్య 18 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి 14, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2 చొప్పున సర్వీసులు రద్దయ్యాయి. రద్దయిన మార్గాల్లో సిటీ బస్సులు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయిన మార్గాల్లో అదనంగా సిటీ బస్సులు నడుపాలని అధికారులు నిర్ణయించారు. కేశవగిరి నుంచి బోరబండ వరకు (22), సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ (54),…