NTV Telugu Site icon

Rains Continue: వదలనంటున్న వాన.. హై అలర్ట్

Rain1

Rain1

తెలంగాణలో గత 15 రోజులుగా వానలు పడుతూనే వున్నాయి. వాన కురిస్తే చాలు జనం హడలిపోతున్నారు. వానలు కావాలని, మృగశిర కార్తెలో వానలు రావాలని గతంలో కోరుకున్నారు. కానీ ఇప్పుడు వానలు ఆగితే బాగుండు.. అనే భావనకు వచ్చారు. తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ హెచ్చరికలు చేసింది హైదరాబాద్ లోని వాతావరణ శాఖ. ఈరోజు ఉత్తర ఒరిస్సా, పరిసర ప్రాంతాల్లో ద్రోణి కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి ఉందని వాతావరణ అధికారి తెలిపారు.

మరోవైపు ఉత్తర – దక్షిణ ద్రోణి ఈరోజు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కొమరన్ ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుంది. రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు చేశారు. ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు రేపు, ఎల్లుండి భారీ వర్షాలు అక్కడక్కడా తెలంగాణా రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Jamili Elections: జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో కేంద్రం కీలక ప్రకటన

ఇటు ఉదయం నుంచి హైదరాబాద్‌ లో వాన పడుతూనే వుంది. కొన్ని ప్రాంతాల్లో భారీవర్షం పడింది. సికింద్రాబాద్ మారేడ్ పల్లిలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నదులను తలపిస్తున్నాయి కంటోన్మెంట్, బోయిన్ పల్లి రోడ్లు. స్కూళ్ళనుంచి వచ్చే విద్యార్ధినీ, విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో మ్యాన్ హోళ్ళు తెరిచి వాన నీటిని పంపిస్తున్నారు. కార్యాలయాల నుంచి బయటకు వచ్చేవారికి ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. వర్షం ఆగిన వెంటనే ఒకేసారి ఉద్యోగులు బయటకు రావద్దంటున్నారు. విపరీతమయిన ట్రాఫిక్ జాం ఏర్పడి ఇబ్బందులు పడతారని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.