Site icon NTV Telugu

Kishan Reddy: ఆ పంట సాగుకు అనుకూలమైన భూమి తెలంగాణలోనే ఉంది

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: దేశ వ్యాప్తంగా పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా ఉన్న భూమిలో 15% భూమి తెలంగాణలోనే ఉందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ – ఆయిల్ పామ్ కార్యక్రమం తెలంగాణ రైతులకు ఎంతో లాభాన్ని చేకూరుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2021-22 నుండి 2025-26 వరకు 5 సంవత్సరాల కాలానికి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ – ఆయిల్ పామ్ కార్యక్రమానికి ఆమోదం తెలిపిందని అన్నారు. పామాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశంలో 2019-20 నాటికి 3.5 లక్షల హెక్టార్లలో ఉన్న పామాయిల్ సాగును 2025-26 నాటికి 10 లక్షల హెక్టార్లకు పెంచి, మరో 6.5 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలలో 3.28 లక్షల హెక్టార్ల భూమిని, మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 3.22 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలని లక్ష్యమన్నారు.

Read also: Taj Mahal: తాజ్ మహల్ సందర్శించాలంటే.. కోవిడ్ పరీక్ష తప్పనిసరి

ఈ పథకం యొక్క మొత్తం అంచనా వ్యయం రూ. 11,040 కోట్లు కాగా, అందులో ఈశాన్య రాష్ట్రాలకు 90:10 ప్రాతిపదికన, మిగిలిన రాష్ట్రాలకు 60:40 ప్రాతిపదికన భారత ప్రభుత్వం 8,844 కోట్లను ఖర్చు చేయనుందని పేర్కొన్నారు కిషన్‌ రెడ్డి. మొత్తం వ్యయంలో రూ. 5,170 కోట్లను తెలంగాణ వంటి జెనరల్ కేటగిరీ రాష్ట్రాలకు కేటాయించగా అందులో భారత ప్రభుత్వం చెల్లించవలసిన వాటా రూ. 3,560 కోట్లని తెలిపారు. పామాయిల్ సాగుకు దేశవ్యాప్తంగా 27.99 లక్షల హెక్టార్ల భూమి అనుకూలంగా ఉంటే, అందులో 15% అనగా 4.36 లక్షల హెక్టార్ల భూమి తెలంగాణలో ఉందని తెలిపారు.

Read also: Gangula Kamalakar: సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబు

తెలంగాణలోని ఈ 4.36 లక్షల హెకార్ల భూమి అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, కొమరం భీమ్ అసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి వంటి 27 జిల్లాలలో విస్తరించి ఉందనిపేర్కొన్నారు. రైతులకు లబ్ధి చేకూర్చటమే ప్రధాన ఉద్దేశ్యంగా NMEO-OP యొక్క మార్గదర్శకాలను రూపొందించటం జరిగిందని తెలిపారు. NMEO వనరులన్నింటిని 17% ఎస్సీలకు, 8% ఎస్టీలకు లబ్ధి చేర్చటానికి కేటాయించడం జరిగిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలలో ఉన్న జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ/ఎస్టీ రైతులకు కేటాయింపులు చేయటానికి వీలు కల్పించటం జరిగిందని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version