సైకిల్ పోయిందని పిల్లాడి ఫిర్యాదు.. పోలీసుల షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాంతి భద్రతలు కాపాడే పోలీసులకు రకరకాల ఫిర్యాదులు వస్తుంటాయి. నాని సినిమాలో పెన్సిల్ పోయిందని పిల్లాడు కంప్లైంట్ చేస్తాడు. అలాంటి కంప్లైంటే వస్తే పోలీసుల పరిస్థితి ఎలా వుంటుంది. అచ్చం సినిమా తరహాలోనే ఫిర్యాదు అందింది. పండగ సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి వచ్చాడో కుర్రాడు. ఇంటికి వచ్చేసరికి అతని సైకిల్ పోయింది. దీంతో తన సైకిల్ వెతికి పెట్టమని పోలీసుల్ని ఆశ్రయించాడో ఆరవ తరగతి చదువుతున్న బాలుడు.

సైకిల్ వెతకండి అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన పదకొండేళ్ళ భువనగిరి సాత్విక్ అనే పిల్లాడు. ఇంటి వద్ద పెట్టిన తన సైకిల్ కనిపించడం లేదని నేరుగా బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెప్పాడు. ఎస్.ఐ ఆవుల తిరుపతి బాలుడి తండ్రికి ఫోన్ చేశాడు. తండ్రి చెప్పిన మాటలు విన్న ఎస్‌ఐకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. తన కొడుకు సాత్విక్ బయట తిరగొద్దని తానే ఇంట్లో సైకిల్ దాచిపెట్టినట్లు తండ్రి తెలిపాడు. అయితే ఎలాంటి భయం లేకుండా, ఎవరి సహాయం లేకుండా ఫిర్యాదు చేయడానికి పోలిస్ స్టేషన్ కు వచ్చిన సాత్విక్ ను ఎస్.ఐ అభినందించారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!