NTV Telugu Site icon

Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం

Revanthreddy

Revanthreddy

Assembly Budget Session: సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై నేడు చర్చ ప్రారంభం కానుంది. దీంతోపాటు గత బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన లోపాలపై సభలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికార కాంగ్రెస్ పార్టీ నిన్న(ఆదివారం) సాయంత్రం ప్రజా భవన్ లో ‘ప్రాజెక్టుల నిర్మాణం – అక్రమాలు’ అనే అంశంపై తమ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రాజెక్టుల గురించి వివరించారు. కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎలా ఎదుర్కోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 13న నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేసిన విమర్శలపై ఎదురుదాడి చేయాలని సూచించారు.

Read also: Seethapalli Vagu: విహారయాత్రలో విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన లోపాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ప్రభుత్వం కార్యక్రమాన్ని ఖరారు చేసి ఈనెల 13న మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు విపక్షాలను ఆహ్వానించినా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు నిరాకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆదివారం సాయంత్రం ఆయన స్వయంగా సీఎం నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. రేవంత్ రెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించారు. ఏది ఏమైనా బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రిని కలవాల్సి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బొంతు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా.. లేక మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశారా అనే విషయంపై స్పష్టత లేదు. బొంతు రామ్‌మోహన్‌ గత రెండు దఫాలుగా ఉప్పల్‌ బరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశించినా ఆ అవకాశం దక్కలేదని తెలుస్తోంది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Assam: చేతబడి ద్వారా చికిత్స చేయడాన్ని నిషేధించే బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం