Telangana Elections Counting NTV Live Updates: తెతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు రాష్ట్ర వ్యాప్తంగా 49 ప్రాంతాల్లో 119 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ సెంటర్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్ ఆశలు ఆవిరైపోయాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం సాధించాయి. సీపీఐ కూడా కాంగ్రెస్‌తో పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార, ప్రభుత్వం ఏర్పాటు సోమవారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఇదిలా ఉండగా.. ఆదివారం రాత్రి సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉంది.
64 సీట్లు సాధించి సాధారణ మెజార్టీతో కాంగ్రెస్ రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. తెలంగాణలో 119 స్థానాలు ఉండగా.. సర్కారు ఏర్పాటుకు 60 సీట్లు అవసరం. కాంగ్రెస్ 64 గెలుచుకుని సాధారణ మెజారిటీని సాధించింది. రేపు ఉదయం కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. సీఎం ఎంపికపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ నేతలు సేకరించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను అధిష్ఠానానికి పంపిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన హస్తం పార్టీ కాసేపట్లో సీఎల్పీ నేతను ఎన్నుకోనుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఈ సమావేశం ఏర్పాటు చేయగా.. గెలిచిన అభ్యర్థులు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. ఏఐసీసీ అబ్జర్వర్ల ఆధ్వర్యంలో సీఎల్పీ నేత ఎంపిక జరగనుంది. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్కడికి చేరుకున్నారు. సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారనేది ఉత్కంఠగా మారింది.
జగిత్యాలలో జీవన్ రెడ్డి ఓటమి..
పదకొండవసారి జగిత్యాల నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి...
1983 నుంచి 5 సార్లు గెలిచి 6 సార్లు ఓడిన జీవన్ రెడ్డి
ధర్మపురి నుంచి మంత్రి కొప్పుల ఓటమి...
నాలుగు సాధారణ ఎన్నికలు, రెండు ఉప ఎన్నికలతో కలిపి ఆరుసార్లు గెలిచిన ఈశ్వర్
ఎనిమిదవ సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతిలో ఓటమి
ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని నిర్మల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. 35 ఏళ్లకు పైగా నిర్మల్ నియోజకవర్గ ప్రజలు వారికి సేవ చేసే భాగ్యం కల్పించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో అహర్నిశలు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ (119) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం..
పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఆశించిన ఫలితం రాలేదన్న ఆయన.. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామన్నారు. 39 స్థానాలతో ప్రతిపక్ష పాత్రను పోషించాలని ప్రజలు చెప్పారని.. ప్రజలు అందించిన తీర్పును శిరసావహిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేక ఎత్తుపల్లాలను చవిచూసిందని.. అనుకున్న తెలంగాణను సాధించామన్నారు. 39 సీట్లు కార్యకర్తల శ్రమతోనే వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు. ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా పని చేస్తామన్నారు. ప్రభుత్వం నడిపే వారు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. రాజకీయాల్లో సహనం అవసరమని.. ప్రజల మన్నన పొందే విధంగా బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందన్నారు.
రాజకీయాల్లో గెలుపు,ఓటములు సహజమని.. గెలిచిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వాన్ని వెంటనే ఇబ్బందిపెట్టమని, వారికి సమయం ఇస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దని ఆయన సూచించారు. హైదరాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడిందన్నారు. ఈ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి పూర్వ వైభవం సాధిద్దామని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతి జిల్లాలో ప్రజలు ప్రాతినిధ్యం కల్పించారన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా కేసీఆర్ రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారన్నారు.
గజ్వేల్‌లో కేసీఆర్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి ఈటలపై కేసీఆర్ గెలుపొందారు. గతంలో కంటే మెజారిటీ తగ్గింది. గజ్వేల్‌లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
మంథని నియోజకవర్గ లో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘనవిజయం... 31 వేల ఓట్ల తేడాతో గెలుపొందిన దుద్దిళ్ల
సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజయం.. 29 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో కేటీఆర్ విజయం
వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి అది శ్రీనివాస్ విజయం.. 14581 ఓట్ల తేడాతో అది శ్రీనివాస్ గెలుపు
హుస్నాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విజయం.. బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ బాబుపై 19334 మెజారిటీతో ఘన విజయం
రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఘనవిజయం... 56 వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందిన రాజ్ ఠాకూర్
పెద్దపల్లిలో భారీ తేడాతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణా రావు.. 41వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం
ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజయం 19670 ఓట్ల తేడాతో గెలిచిన లక్ష్మణ్ కుమార్
కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ విజయం.. ఎంపీ ధర్మపురి అరవింద్ పై 10540 ఓట్ల తేడాతో గెలిచిన సంజయ్
జగిత్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎం.సంజయ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై విజయం... 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచిన సంజయ్
చొప్పదండిలో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి.సత్యం విజయం.. బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ పై 36910 ఓట్ల తేడాతో విజయం
మానకొండూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ విజయం.. బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ పై 31743 ఓట్ల తేడాతో విజయం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
1, ఆదిలాబాద్ - పాయల్ శంకర్ (బీజేపీ)
2, నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి (బీజేపీ)
3, ఖానాపూర్ - వెడ్మ బొజ్జు (కాంగ్రెస్)
4, బోథ్ - (బీఆర్ఎస్)
5, ముధోల్ - (బీజేపీ)
6, మంచిర్యాల్ - ప్రేమ్ సాగర్ రావు (కాంగ్రెస్)
7, చెన్నూర్- వివేక్ వెంకటస్వామి (కాంగ్రెస్)
8, బెల్లంపల్లి - వినోద్ (కాంగ్రెస్)
9, సిర్పూర్ టి- హరీష్ బాబు (బీజేపీ)
10, ఆసిఫాబాద్ - కోవాలక్ష్మి (బీఆర్ఎస్)
కామారెడ్డిలో బీజేపీ విజయం.. సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఓడించిన బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి 7819 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి సిగపురం ఇందిరాపై విజయం సాధించారు.
మొత్తం BRSకు 88,329 పోలయ్యాయి.
కాంగ్రెస్‌కు 80,510 ఓట్లు పోలయ్యాయి.
వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ 12,672 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
సిర్పూర్‌లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ రావు 5600 మెజారిటీతో విజయం సాధించారు.
కొడంగల్ నియోజకవర్గంలో ముగిసిన ఓట్ల లెక్కింపు..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డికి 1,07,429 ఓట్లు
బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కి 84,897
32,532 మెజార్టీతో పట్నం నరేందర్ రెడ్డి పై రేవంత్ రెడ్డి గెలుపు.
మేడ్చల్ నియోజకవర్గంలో 33,419 మెజారిటీతో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు.
మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి భారీ విజయం
26, 320 ఓట్ల మెజారిటీతో ఘన విజయం
తన సమీప అభ్యర్థి బీజేపీకి చెందిన అందెల శ్రీరాములు యాదవ్‌పై ఘన విజయం
పోస్టల్ బ్యాలెట్లు బీజేపీకి 1168, బీఆర్‌ఎస్‌కు 825, కాంగ్రెస్‌కు 1126 ఓట్లు
సబితా ఇంద్రారెడ్డికి పోలైన ఓట్లు 1,25,416
బీజేపీ కి చెందిన అందెల శ్రీరాములుకు 99,096
కాంగ్రెస్‌కు అభ్యర్థి జైపాల్ యాదవ్‌కు 70,515 ఓట్లు నమోదు
తాండూరు నియోజకవర్గంలో 5,921 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి విజయం.. మనోహర్ రెడ్డికి 83,684 ఓట్లు.. పైలెట్ రోహిత్ రెడ్డికి 77,763 ఓట్లు.
బోథ్ బీఆర్‌ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం.. 23 వేలకు పైగా మెజార్టీతో గెలుపు.
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారు.
కొల్లాపూర్ -జూపల్లి కృష్ణారావు గెలుపు
కల్వకుర్తి -కసిరెడ్డి నారాయణరెడ్డి.. గెలుపు
గద్వాల- సరితా తిరుపతయ్య.. ఓటమి
నకిరేకల్ - వేముల వీరేశం..గెలుపు
తుంగతుర్తి- మందుల సామేలు..గెలుపు
ఖమ్మం: తుమ్మల నాగేశ్వర రావు..గెలుపు
పాలేరు- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..గెలుపు
పినపాక - పాయం వెంకటేశ్వర్లు..గెలుపు
ఇల్లందు- కోరం కనకయ్య...గెలుపు
జగిత్యాల- బోగా శ్రావణి..ఓటమి
ఖానాపూర్ - శ్యామ్ నాయక్.. ఓటమి.
ఖమ్మం జిల్లా: వైరాలో కాంగ్రెస్ గెలుపు.. కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ రామదాసు నాయక్ 33,069 ఓట్ల మెజారిటీతో విజయం
వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మేఘా రెడ్డి విజయం.
మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి.
అలంపూర్ లో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజేయుడు.
గద్వాల్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి విజయం.
జడ్చర్ల లో కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ రెడ్డి విజయం.
నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి విజయం.
అచ్చంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ విజయం.
కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం.
కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి విజయం.
కొడంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విజయం.
నారాయణపేటలో కాంగ్రెస్ అభ్యర్థి పర్ణిక రెడ్డి విజయం.
మక్తల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి విజయం.
కరీంనగర్ జిల్లా: మానకొండుర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఘన విజయం.. బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్‌పై భారీ మెజారిటీతో గెలుపు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి విజయం
నిజామాబాద్ : బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి విజయం
హ్యాట్రిక్ కొట్టిన రాజాసింగ్.. గోషామహల్ నియోజకవర్గం నుంచి మూడోసారి ముచ్చటగా బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన రాజాసింగ్
వేములవాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ 14913 మెజార్టీతో విజయం
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ 45,319 ఓట్ల మెజారిటీతో విజయం.
కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం, నర్సంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి గెలుపొందారు.
1.ఆశ్వరావుపేటలో కాంగ్రెస్ విజయం
2. ఇల్లందులో కాంగ్రెస్ విజయం
3. రామగుండం లో కాంగ్రెస్ విజయం
4.చార్మినార్ MIM విజయం
5.అంబర్ పేటలో BRS విజయం
6.జుక్కల్ కాంగ్రెస్ విజయం
7.దుబ్బాక BRS విజయం
8. ఆందోల్ లో కాంగ్రెస్ విజయం
9.నల్గొండ కాంగ్రెస్ విజయం
10. బెల్లంపల్లి కాంగ్రెస్ విజయం
11.నారాయణపేట కాంగ్రెస్ విజయం
12.కొడంగల్ కాంగ్రెస్ విజయం
13. చంద్రయాన్ గుట్ట ఎంఐఎం విజయం
14.పాలకుర్తి కాంగ్రెస్ విజయం
15. వేములాడలో కాంగ్రెస్ విజయం
16. మునుగోడు కాంగ్రెస్ విజయం
17.బాల్కొండ BRS విజయం
18. సికింద్రాబాద్ BRS విజయం
19.సిద్దిపేట BRS విజయం
20.ఆర్మూర్ బీజేపీ విజయం
21.నిర్మల్ బీజేపీ విజయం
22.హుజూర్ నగర్ కాంగ్రెస్ విజయం
23. భద్రాచలం BRS విజయం
24.సిరిసిల్ల BRS విజయం
25. భాన్స్ వాడ BRS విజయం
26.హుజూరాబాద్ BRS విజయం
27.ములుగు కాంగ్రెస్ విజయం
28.ముషీరాబాద్ BRS విజయం
29.నకిరేకల్ కాంగ్రెస్ విజయం
30.మేడ్చల్ BRS విజయం
31. నాగార్జున సాగర్ కాంగ్రెస్ విజయం
32.మంథని కాంగ్రెస్ విజయం
33.సనత్ నగర్ BRS విజయం
34.చెన్నూర్ కాంగ్రెస్ విజయం
35. సికింద్రాబాద్ BRS విజయం
36. ముదొల్ బిజెపి విజయం
37.నిజామాబాద్ అర్బన్ బిజెపి విజయం
ఆందోల్‌లో 27 వేల 427 ఓట్ల మెజారిటీతో దామోదర రాజనర్సింహ విజయం సాధించారు.
ఖమ్మం: మధిర కాంగ్రెస్ అభ్యర్థి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌పై 35,190 ఓట్లతో విజయం సాధించారు.
నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై గెలుపొందారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో కౌంటింగ్ ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 37189 ఓట్ల మెజారిటీతో వివేక్ గెలుపొందారు.
కాంగ్రెస్‌కు పోలైన ఓట్లు 85,916.
బీఆర్‌ఎస్‌కు పోలైన ఓట్లు 50,431.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంబర్‌పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విజయం సాధించారు.
సనత్ నగర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు.
కామారెడ్డిలో ఓట్ల లెక్కింపు హోరాహోరీగా సాగుతుంది. కామారెడ్డిలో 14వ రౌండ్ ముగిసేసరికి 2,100 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉండగా.. రెండో స్థానంలో రేవంత్‌రెడ్డి, మూడోస్థానంలో కేసీఆర్ ఉన్నారు.
కొత్తగూడెంలో 9వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 23224 సీపీఐ లీడ్ ఉంది.
సిపిఐ అభ్యర్థి కూననేని సాంబశివరావు: 46,719
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జలగం వెంకటరావు: 23495
బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు: 16,299
సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు...23,224 ఓట్లతో ముందంజ.
కామారెడ్డిలో కేసీఆర్ వెనుకంజలో ఉన్నారు.
మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి గెలుపు
తుంగుత్తురిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ ఓటమి
కాంగ్రెస్ అభ్యర్థి శ్యామూల్ గెలుపు.
మంథనిలో శ్రీధర్‌బాబు గెలుపు
30వేలకు పైగా మెజార్టీతో గెలుపు
సికింద్రాబాద్‌లో పద్మారావు గౌడ్ గెలుపు.
నిజామాబాద్ జిల్లా కౌంటింగ్ కేంద్రం నుంచి రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజి రెడ్డి గోవర్ధన్ బయటకు వెళ్లిపోయారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పై రాకేష్ రెడ్డి విజయం సాధించారు.
వికారాబాద్ జిల్లా కౌంటింగ్ సెంటర్ నుంచి తాండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి బయటికి వెళ్లిపోయారు. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నా అన్నారు. కాంగ్రెస్ గాలి వీచింది... అది కాంగ్రెస్ గెలుపుకు దోహదం అయ్యిందన్నారు. మా పథకాలు గడప గడప కి వెళ్ళాయి.. అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకో తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
* మునుగోడులో 21వేల మెజార్టీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు.
* సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపు.
* చరిత్రను తిరగరాసిన స్పీకర్ పోచారం
* తెలంగాణ చరిత్రలో స్పీకర్‌గా ఓడిపోవడం అనవాయితీ.. కానీ, ఈ ఎన్నికల్లో పోచారం విజయం సాధించి చరిత్ర తిరగరాశారు.
* కాంగ్రెస్ అభ్యర్థులు గడ్డం బ్రదర్స్(వినోద్), కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపు.
* నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
* పటోళ్ల సంజీవ రెడ్డి భారీ గెలుపు.
* బాన్సువాడలో పోచారం గెలుపు
* బాన్సువాడలో బీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం విజయం
* మేడ్చల్‌లో మల్లారెడ్డి గెలుపు.
* నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్తి వేముల వీరేశం గెలుపు
* ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు
* చేవెళ్ల, స్టేషన్‌ఘన్‌పూర్ మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం
* కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గెలుపు
* నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్తి వేముల వీరేశం గెలుపు
* మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి
* నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ విజయం
* హుజుర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ విజయం
* 46వేల మెజార్టీతో ఉత్తమ్ గెలుపు
* కొడంగల్‌లో రేవంత్ విజయం..32వేల మెజార్టీతో రేవంత్ గెలుపు
* భద్రాచలంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్‌రావు విజయం
నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ గెలుపు సాధించింది. 20వేల పై చిలుకు ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి విజయం సాధించారు.
మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ పై 30458 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన శ్రీధర్ బాబు.
మంతనిలో 5వసారి శ్రీధర్ బాబు విజయం సాధించారు.
హుజురాబాద్ లో 11వ రౌండ్ ముగిసేసరికి 13757 ఓట్ల ఆధిక్యంలో కౌశిక్ రెడ్డి
బీజేపీ -2197
బీఆర్ఎస్ -4179
కాంగ్రెస్ -2119
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. కోమటిరెడ్డి సోదరులిద్దరూ ఘన విజయం సాధించారు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 54 వేల ఓట్లతో విజయం సాధించారు. నల్గొండలో కాంగ్రెస్ పార్టీ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 54 వేలకు పైగా ఓట్ల పైచిలుకుతో ఘన విజయం సాధించారు.
మహేశ్వరంలో 17 రౌండ్ ముగిసేసరికి 23940 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.
బీజేపీ.....6784 - మొత్తం- 84835
బీఆర్ఎస్.. 7864 - మొత్తం- 108775
కాంగ్రెస్.. 4040 - మొత్తం - 55096
జగిత్యాల జిల్లా కోరుట్లలో 11 వ రౌండ్ ముగిసేసరికి 7190 ఓట్ల ఆధిక్యంలో బీఅర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ ముందంజలో ఉన్నారు.
బీఆర్ఎస్ 40,552
బీజేపీ 33,362
కాంగ్రెస్ 25,777
కరీంనగర్ జిల్లా 14 రౌండ్లు ముగిసేసరికి 4039 ఓట్ల ఆధిక్యంలో గంగుల కమలాకర్ ముందంజలో వున్నారు.
బీఆర్ఎస్ -3253
కాంగ్రెస్ -913
బీజేపీ -5411
వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి పై దాడి చేశారు. కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళుతున్న నిరంజన్ రెడ్డి పై రాళ్ళు, చెప్పులతో దాడి చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంద.
వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్ధి నాగరాజు విజయం సాధించారు. 18 వేల మెజారిటీతో నాగరాజు విజయం సాధించారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో 11 వ రౌండ్ ముగిసేవరకు 7190 ఓట్ల ఆధిక్యంలో బీఅర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ ముందంజలో వున్నారు.
బీఆర్ఎస్ 40,552
బీజేపీ 33,362
కాంగ్రెస్ 25,777
తెలంగాణలో డిపాజిట్లు కూడా రాని స్థితిలో జనసేన అభ్యర్థులు పరిస్థితి నెలకొంది. పోటీ చేసిన ఎనిమిది చోట్ల అదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన పార్టీలకు ఏమాత్రం దరిదాపుల్లో ఓట్లు దక్కించుకోని జనసేన అభ్యర్థులు. 80కి పైగా స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు.