Telangana DGP Congratulates Revanth Reddy at his Residence: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిమిష నిమిషానికి ఉత్కంఠ పెంచుతూ చుట్టూ పోతుంది. దాదాపు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తుండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి నివాసానికి పోలీసులు అదనపు సెక్యూరిటీ బలగాలు పంపగా ఇప్పుడు రేవంత్ రెడ్డి నివాసానికి డీజీపీ అంజనీ కుమార్ వెళ్లినట్లు తెలుస్తోంది. డిజిపి అంజనీ కుమార్ తో పాటు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ కూడా వెళ్లి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ విజయం నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపినట్లుగా తెలుస్తోంది.
V.H: రేవంత్ రెడ్డి పార్టీ కోసం కష్టపడ్డారు.. సీఎం ఎవరో తేల్చిన వీహెచ్
డిజిపి అంజనీ కుమార్, సీపీ మహేష్ భగవత్, అలాగే సంజయ్ కుమార్ జైన్ వంటి అధికారులు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు అనధికార లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా బీఆర్ఎస్ పార్టీ 40 స్థానాల్లో, బీజేపీ 9 ఎంఐఎం, 5 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఇల్లందు, రామగుండం, అశ్వారావుపేట నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇక మరోపక్క ఎంఐఎం తరఫున చార్మినార్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.