NTV Telugu Site icon

Gajwel Constituency: గజ్వేల్ నియోజకవర్గంలో భారీగా నమోదైన నామినేషన్లు

Gajwel Constituency

Gajwel Constituency

Gajwel Constituency: రాష్ట్రంలో దీపావళి పండగ వాతావరణం కంటే ఎన్నికల వాతావరణం వేడి వేడిగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో భారీగా నామినేషన్లు నమోదయ్యాయి. గజ్వేల్‌లో మొత్తం 127 మంది నుంచి 157 నామినేషన్లు నమోదు కావడం గమనార్హం. సీఎం కేసీఆర్‌పై పలువురు బాధితులు పోటీకి దిగుతున్నారు.

Also Read: Variety Wedding Card: వెరైటీ పెళ్లి కార్డు.. ఎంత టీచర్‌ అయితే మాత్రం ఇలా ప్రింట్ చేస్తారా?

రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ఫ్లాట్ల బాధితులు 100 నామినేషన్లు వేశారు. 1980లో 460 ఎకరాల్లో 3 వేల ప్లాట్లను మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేశాయి. ధరణి వచ్చాక 1980 లో ఉన్న పట్టదారులపైనే ఆ భూములు చూపిస్తున్నాయి. ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సమస్యని అందరికి తెలిసేందుకే పోటీ చేస్తున్నామని బాధితులు వాపోతున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఆ భూములు కొనుగోలు చేశామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: KA Paul: తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు.. కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు

గజ్వేల్ నుంచే సీఎం కేసీఆర్‌పై జగిత్యాల చెరకు రైతులు కూడా పోటీకి దిగారు. ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాల తరపున కూడా నామినేషన్ దాఖలు అయింది. నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు రావడం లేదని వాపోతున్నారు.