KTR: ఏడ్వాలంటే కాంగ్రెస్‌కు.. నవ్వాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Comments: మీరు ఏడ్వాలంటే కాంగ్రెస్‌కు.. నవ్వాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయాలని ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా ధర్మపురిలో కేటీఆర్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వెల్గటూర్ నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషన్‌తో మాట్లాడి మరోసారి రైతు బంధును నిలిపివేశారు. రైతులు ఆందోళన పడొద్దు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమచేస్తం. 30న కారు గుర్తుకు ఓటేసి కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి.
Also Read: Karnataka: లక్ష అప్పు.. ముగ్గురు పిల్లలతో సహా భార్యభర్తల ఆత్మహత్య.. రెండు పేజీల సూసైడ్ నోట్
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. కాంగ్రెస్ నాయకులు 3 గంటల కరెంట్ చాలని అంటున్నారు. 24 గంటల కరెంట్ గురించి..మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేక ఎంత ఇబ్బంది పడ్డమో..రైతులు గుర్తుకు తెచ్చుకోవాలి. 24 గంటల కరెంట్ ఇస్తుంది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. దేశంలో 16 రాష్ట్రాల్లో ఎక్కడలేని విధంగా పీఎఫ్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే. ధరణీ రద్దు చేస్తామని భట్టి విక్రమార్క.. రెడ్డి రైతు బంధు దుబారా ఉత్తమ్ కుమార్ అనడం సిగ్గుచేటు.
Also Read: Delhi: విషాదం.. గుండెపోటుతో ఆరేళ్ల చిన్నారి మృతి
కాంగ్రెస్‌కు ఓటేస్తే.. తెలంగాణ రాష్ట్రం చచ్చి పొద్ది. పది రోజుల్లో వచ్చేది.. బీఅర్ఎస్. స్తంభంపల్లి వద్ద ఇథనాల్ ప్రాజెక్ట్ రద్దు చేసి, వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేస్తాం. కేసిఆర్ పాలనే ప్రజలకుశ్రీరామ రక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మపురి నియోజక వర్గంలో దళిత బంధు పథకం ఇంటింటా ఇస్తం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులే. మీరు ఏడ్వాలి అంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి నవ్వాలి అంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయండి. గాడుదులకు గడ్డి వేసి అవులకు పాలు పిండితే రావు. మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!