NTV Telugu Site icon

Etela Rajender: రైతులకు రైతుబంధు ఇచ్చి మిగతావి బందు చేశారు: ఈటెల

Etela Rajendar

Etela Rajendar

భద్రాద్రి: రైతులకు రైతుబంధు ఇచ్చి మిగతావి బంధు చేశారన్నారు ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటెల రాజేందర్. బుధవారం ఇల్లందులో జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో ఈటెల పాల్గొని ప్రసంగించారు. సింగరేణి గనులకు పుట్టినిల్లు ఇల్లందు.. బీజేపీ అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు ఇన్‌కం ట్యాక్స్ రద్దు చేస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ప్రధాని మోదీకి ఉండాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇచ్చి మిగతావి బంధు చేశారన్నారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనడం లేదని, కింటాకు ఐదు నుంచి పది కేజీల తరుగు తీసి రైతులకు నష్టం చేస్తు్న్నారని ఆరోపించారు.

Also Read: Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి ఓట్లు అడగగలరా?.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్‌

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కింటా ధాన్యంకు 3100 చెల్లిస్తామని చెప్పారు. మిర్చి రైతులకు ఖమ్మంలో బేడీలు వేసి జైలుకు పంపిన ఘనత కేసీఆర్‌ది అని ధ్వజమెత్తారు. రైతుల కీర్తిని బీజేపీ చాటుతుందన్నారు. రైతులకు ఇచ్చే సబ్సిడీలు అన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని, కానీ బీజేపీ అలా కాదన్నారు. పేదరికంలో ఉన్న వారికి ఆర్థిక చేయూతనిస్తామన్నారు. రైతు కూలీలకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ చెల్లిస్తామన్నారు. అలాగే పెట్రోల్ డీజిల్ పై వ్యాట్‌ను తగ్గిస్తామని చెప్పారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం రాబోతుందని, లక్ష కోట్ల కాలేశ్వరం ప్రాజెక్టు పగిలిపోయింది ముఖ్యమంత్రి కేసీఆర్ డిజైన్ లోపం మూలంగానే ప్రాజెక్టు కుంగింది. తెలంగాణ రాగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇన్ని సంవత్సరాల్లో తెలంగాణలో ఏనాడైనా దళితులను ముఖ్యమంత్రి చేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్‌లు బీసీలను విస్మరిస్తున్నాయని ఈటెల పేర్కొన్నారు.

Also Read: Divya Vani: అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను..