Ponguleti Srinivas Reddy: కొత్త ప్రభాకర్ రెడ్డి, బాలరాజుపై కాంగ్రెస్ దాడి చేయించిందా అని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్సే దాడి చేయించిందని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇస్తుందని అనుకుంటున్నామని ఆయన తెలిపారు. సీపీఎం మాతో పొత్తులో ఉంటుందని అనుకుంటున్నానని.. సీపీఎంతో సీట్ల విషయంలో గ్యాప్ వచ్చిందన్నారు. కేసీఆర్ అహంకారి అని ఆ పార్టీ నేతలను అడిగితే చెబుతారన్నారు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మే ప్రస్తక్తి లేదని..కాంగ్రెస్‌ను ప్రజలందరూ ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందన్నారు.
వందకు వంద శాతం ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీదే పేటెంట్ అని.. ఎవరెన్ని విమర్శలు చేసినా 24 గంటల ఉచిత విద్యుత్ అందించి తీరుతామన్నారు. ఉచిత్ విద్యుత్ కాంగ్రెస్ మానస పుత్రిక అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్‌పై మా పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్నది హైకమాండే నిర్ణయం తీసుకుంటుందన్నారు. నేను ముఖ్యమంత్రి రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. జలగం వెంకట్రావుకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదని ఆయన అన్నారు.
Also Read: Kotha Manohar Reddy: గడప గడపకు ప్రచారంలో దూసుకుపోతున్న మనోహర్ రెడ్డి
ఈ ఎన్నికల్లో దాదాపు 70 కంటే అధిక స్థానాల్లో గెలిచి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు అనేది అసలు ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఊహించిన విధంగా కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.