MLA Laxmareddy: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 50 మందికి పైగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా నవాబుపేట మండలం ఇప్పటూరు గ్రామ కాంగ్రెస్ నాయకులు 60 మందికి పైగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెల్లరేషన్ కార్డు ఉన్న పేదలందరికీ సన్న బియ్యం, సౌభాగ్యలక్ష్మీ పథకం కింద గృహిణులకు రూ.మూడువేలు, అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక గురుకులాలతోపాటు ప్రతి ఇంటికి ఐదు లక్షల కేసీఆర్ బీమా పథకాలను తెలంగాణ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇంతటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సర్కారునే మళ్లీ ఆశీర్వదించాలని, కారుగుర్తుకు ఓటు వేసి లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.