Site icon NTV Telugu

WhatsApp: తిరిగి ప్రారంభమైన వాట్సాప్‌ సేవలు.. ఊపిరిపీల్చుకున్న యూజర్లు..

Whatsapp

Whatsapp

వాట్సాప్‌ సేవలు పునరుద్ధరించింది దాని మాతృ సంస్థ మెటా… సాంకేతిక లోపంతో మధ్యాహ్నం 12.29 గంటల నుంచి నిలిచిపోయిన వాట్సాప్‌ సేవలు… మొదట ఇండియాలోనే దాని సేవలు నిలిచిపోయాయనే వార్తలు వచ్చినా.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సోషల్‌ మీడియా ద్వారా బహిర్గతం అయ్యింది.. అయితే, దాదాపు 110 నిమిషాల తర్వాత తిరిగి వాట్సాప్‌ సేవలు ప్రారంభం అయ్యాయి.. సాంకేతిక సమస్య నెలకొంది… పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం… త్వరలోనే పునరుద్ధరిస్తామంటూ.. దాని మాతృసంస్థ మెటా ప్రకటించిన తర్వాత తిరిగి వాట్సాప్‌ సేవలు ప్రారంభం అయ్యాయి..

Read Also:Meta on WhatsApp down: నిలిచిపోయిన వాట్సాప్‌ సేవలు.. మెటా రియాక్షన్‌ ఇదే..

కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం 12.29 గంటల నుంచి వాట్సాప్‌ సేవలు ఆగిపోయాయి… యాప్‌ నుంచి సందేశాలు వెళ్లడంలేదని యూజర్లు నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తాయి.. #whatsappdown అనే యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో తమ ఫిర్యాదులు హోరెత్తించారు.. దీంతో దెబ్బకి ఆ యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వెళ్లింది.. కొన్ని నిమిషాల్లోనే కొన్ని లక్షల ట్వీట్లు వచ్చాయి.. వాట్సాప్‌ సేవలు నిలిచిపోవడంతో.. క్రమంగా టెలిగ్రామ్‌వైపు మొగ్గుచూపారు నెటిజన్లు.. మరోవైపు వాట్సాప్‌ను టార్గెట్‌ చేస్తూ మీమ్స్‌ సృష్టించారు నెటిజన్లు.. ఫేస్‌బుక్‌, ఇస్టా, వట్సాప్‌. ట్విట్టర్‌ బొమ్మలను షేర్‌ చేశారు.. వాటిలో.. ట్విట్టర్‌కు మిగతా మూడు సోషల్‌ మీడియా యాప్స్‌ సెల్యూట్‌ చేస్తున్నట్టు రూపొందించి సోషల్‌ మీడియాలో వదిలారు నెటిజన్లు.. మొత్తంగా.. సెటైర్లు, విమర్శల తర్వాత.. తిరిగి వాట్సాప్‌ సేవలు ప్రారంభం కావడంతో.. మళ్లీ తమ పని మొదలుపెట్టేశారు.

Exit mobile version