WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- వాట్సాప్ కోసం ‘Incognito Chat with Meta AI’ ఫీచర్ ప్రకటించిన మెటా
- Private Processing Technology ఆధారంగా రూపొందించిన కొత్త సిస్టమ్
- Trusted Execution Environment (TEE)లో AI చాట్ ప్రాసెసింగ్
- యూజర్ చాట్లను మెటా కూడా యాక్సెస్ చేయలేదని కంపెనీ స్పష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp Introduces Incognito AI Chat: మెటా (Meta)సంస్థ తన AI సేవల్లో మరో కీలక ఫీచర్‌ను ప్రకటించింది. ‘Incognito Chat with Meta AI’ పేరుతో తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్‌ను మెటా తన ‘Private Processing Technology’ ఆధారంగా రూపొందించింది. AI చాట్‌లన్నీ Trusted Execution Environment (TEE) అనే ప్రత్యేక భద్రతా వ్యవస్థలో ప్రాసెస్ అవుతాయని కంపెనీ తెలిపింది. దీని వల్ల యూజర్ సంభాషణలను ఇతరులు మాత్రమే కాదు, మెటా కూడా యాక్సెస్ చేయలేదని కంపెనీ చెబుతోంది.
ఈ ఫీచర్లో అత్యంత ముఖ్యమైన అంశం ‘Zero Server Logs’. అంటే యూజర్ చేసిన చాట్లు కంపెనీ సర్వర్లలో నిల్వ ఉండవు. ప్రస్తుతం ఉన్న చాలా AI ప్లాట్‌ఫామ్‌లు చాట్ హిస్టరీని నెలల తరబడి సర్వర్లలో స్టోర్ చేస్తుండగా, మెటా మాత్రం ఈ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తోంది. ‘Incognito Chat’లో చేసిన సంభాషణలు తాత్కాలికంగానే ఉంటాయి. యూజర్ సెషన్‌ను ముగించిన వెంటనే అన్ని మెసేజ్‌లు డివైస్ నుంచే పూర్తిగా తొలగిపోతాయి. దీని వల్ల వ్యక్తిగత, సున్నితమైన అంశాలపై కూడా వినియోగదారులు భయపడకుండా AIతో చర్చించే అవకాశం ఉంటుంది.
Also Read
- Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
- Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్‌టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
ఈ ఫీచర్ గోప్యతా స్థాయిని వాట్సాప్ లో ఇప్పటికే ఉన్న End-to-End Encryption విధానంతో పోల్చింది మెటా. అంటే యూజర్ డేటా బయట వ్యక్తులకు మాత్రమే కాదు, ప్లాట్‌ఫామ్ నిర్వహించే సంస్థకూ కనిపించదని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ‘Incognito Chat with Meta AI’ ఫీచర్‌ను రాబోయే నెలల్లో వాట్సాప్‌తో పాటు స్టాండ్అలోన్ Meta AI యాప్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే భవిష్యత్తులో ‘Side Chat with Meta AI’ అనే మరో ఫీచర్‌ను కూడా తీసుకురానున్నట్లు మెటా వెల్లడించింది.
ఇది యూజర్ ప్రస్తుతం చేస్తున్న చాట్‌ను అంతరాయం కలగకుండా, అదే సమయంలో ప్రైవేట్ AI సహాయాన్ని అందించే విధంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. సున్నితమైన విషయాలపై భద్రంగా AI సహాయం పొందాలనుకునే వినియోగదారుల కోసం ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశామని మెటా రీసెర్చ్ విభాగం పేర్కొంది.
తాజావార్తలు
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్‌కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
-
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!