ప్రముఖ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం కొత్త ఫీచర్స్ ను తీసుకొని వస్తుంది.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఈ ఫీచర్ వల్ల ఫైల్స్ ను పంపించవచ్చు.. టెస్టింగ్ పూర్తయిన తర్వాత రాబోయే కాలంలో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా సమీపంలోని వ్యక్తులతో ఫైల్స్ను ట్రాన్స్ఫర్ చేయడం కూడా కుదురుతుంది. అంటే షేర్ఇట్ వంటి ఫైల్ ట్రాన్స్ఫర్ యాప్స్ కూడా అవసరం లేదని అర్థం..
షేర్ ఇట్ యాప్ లాగే ఈ ఫీచర్ ఉపయోగ పడుతున్న మాట.. ఆ ఫైల్స్ ను షేర్ చేసేటప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు పక్కనే ఉండాలి.. ఫైల్ను ఎంచుకున్న తర్వాత యూజర్ మొబైల్కు ఒక రిక్వెస్ట్ వస్తుంది. అతను తన ఫోన్ను షేక్ చేసినప్పుడు రిసీవ్ చేసుకుంటాడు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా దశలో ఉంది.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది..
అయితే దీనికి హై స్పీడ్ డేటా అవసరం. డేటా స్పీడ్ తక్కువగా ఉంటే ఫైల్ నెమ్మదిగా డౌన్లోడ్ అవుతుంది. దీనికి చాలా గంటలు కూడా పడుతుంది. ఈ సమస్యను తొలగించేందుకు కంపెనీ యాప్లో కొత్త ఆప్షన్ను తీసుకువస్తోంది.. మీరు తప్ప దాన్ని ఎవరూ చూడలేరు. మీరు మీ కాంటాక్ట్లలో సేవ్ చేయని వ్యక్తులతో ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, మీ మొబైల్ నంబర్ వారికి కనిపించదు.. ఇలాంటి మరెన్నో ఫీచర్స్ ను అందుబాటులో తీసుకురానుంది..