భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo X500 Series India Launch: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) భారత మార్కెట్లోకి తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ Vivo X500 సిరీస్ త్వరలో భారత్‌లో విడుదల కానున్నట్లు కంపెనీ అధికారికంగా టీజర్ విడుదల చేసింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ సిరీస్‌లో ZEISS కెమెరా టెక్నాలజీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ‘ZEISS Cinematics. Create Further’ అనే ట్యాగ్‌లైన్‌తో కంపెనీ ఈ ఫోన్లను ప్రమోట్ చేస్తోంది.
ఈ సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్‌గా ఉండనున్న Vivo X500 Pro Max కోసం ప్రత్యేకంగా ZEISS Telephoto Extender Gen 2 Ultra లెన్స్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఎక్స్టర్నల్ లెన్స్ సహాయంతో 400mm ఈక్వివలెంట్ ఫోకల్ లెంగ్త్‌ను పొందవచ్చు. ఫోన్లోని కెమెరా యాప్ ద్వారా ఈ లెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్రత్యేక యాక్సెసరీ Vivo X500 Pro Maxకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దీనిని స్మార్ట్‌ఫోన్‌తో పాటు కాకుండా విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
Also Read
- Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
- గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
- Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
- Mijia Electric Toothbrush 2 Pro: షియోమీ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ లాంచ్.. కలర్ స్క్రీన్, ప్రెజర్ అలర్ట్ ప్రత్యేకతలు ఇవే!
సాఫ్ట్వేర్ పరంగా Vivo X500 సిరీస్‌లో కొత్త OriginOS 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించనున్నారు. ఇది ఆండ్రాయిడ్ ఆధారంగా రూపొందించిన వివో సరికొత్త యూజర్ ఇంటర్ఫేస్. ఇందులో కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లు, మెరుగైన యూజర్ ఎక్స్పీరియన్స్ అందించే అవకాశం ఉంది. స్మార్ట్ఫోన్లతో పాటు Vivo Watch GT2 స్మార్ట్‌వాచ్‌ను కూడా భారత మార్కెట్లోకి తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ విడుదల చేసిన ప్రమోషనల్ పోస్టర్లో ఈ వాచ్‌ను కూడా ప్రదర్శించింది. అయితే స్మార్ట్‌ఫోన్‌తో పాటు వాచ్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు వీటిని విడివిడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
డిజైన్ విషయానికి వస్తే Vivo X500 సిరీస్ ఫోన్లలో వెనుకవైపు పెద్ద సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌ను అందించారు. ఇందులో పలు అధునాతన కెమెరా సెన్సార్లు, ZEISS T* యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉన్నాయి. కర్వ్డ్ మెటాలిక్ ఫ్రేమ్‌తో పాటు ఆకర్షణీయమైన ఎర్త్ టోన్ కలర్ ఫినిషింగ్‌ను అందించారు. వివో ఇప్పటివరకు భారత లాంచ్ తేదీ, ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే తాజా నివేదికల ప్రకారం 2026 నవంబర్ చివరి వారంలో ఈ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. అధికారిక లాంచ్ ఈవెంట్లోనే ధరలు, పూర్తి స్పెసిఫికేషన్లపై స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. చెవిరెడ్డికి పులివర్తి సుధ వార్నింగ్!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Ramayana Twitter Review: ఫైట్స్ అదుర్స్.. రణబీర్, యాష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ .. ‘రామాయణం’ ఫస్ట్ షోపై ఆడియన్స్ టాక్..
-
CCTV Cameras Offline:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సీసీ కెమెరాల చిత్రం.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఆఫ్‌లైన్!
-
Explainer: గే, ట్రాన్స్జెండర్ల దూకుడు.. రెయిన్బో సునామీలో ట్రంప్ గల్లంతు!
ట్రెండింగ్
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!