33 రోజుల బ్యాటరీ, 100 స్పోర్ట్స్ మోడ్‌లు, eSIM సపోర్ట్‌తో Vivo Watch GT 2 లాంచ్..!
- వివో తన కొత్త స్మార్ట్‌వాచ్ Vivo Watch GT 2 ను చైనాలో లాంచ్
- 2.07 అంగుళాల రెక్టాంగ్యులర్ డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్, 2,400 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్
- బ్లూఓఎస్ 3.0 పై నడుస్తుంది.
- ఒక్కసారి చార్జ్‌తో 33 రోజుల వరకు బ్యాటరీ లైఫ్, eSIM వెర్షన్‌లో 28 రోజుల వరకు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo Watch GT 2: వివో (Vivo) తాజాగా తన స్మార్ట్‌వాచ్ Vivo Watch GT 2ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఈ వాచ్‌ను కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ Vivo X300, Vivo X300 Pro, Vivo Pad 5e, Vivo TWS 5తో పాటు లాంచ్ చేసింది. కొత్త Vivo Watch GT 2లో 2.07 అంగుళాల రెక్టాంగ్యులర్ స్క్రీన్ ఉండగా.. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 2,400 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ బ్లూఓఎస్ 3.0 ఆధారంగా నడుస్తుంది. కంపెనీ ప్రకారం ఇది ఒక్కసారి చార్జ్‌తో గరిష్టంగా 33 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. అయితే eSIM వేరియంట్ మాత్రం 28 రోజుల వరకు పనిచేస్తుందని చెబుతోంది.
Crime News: బాలానగర్లో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్న తల్లి
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ఇక స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. ఈ స్మార్ట్‌వాచ్‌లో 2.07 అంగుళాల అల్ట్రా నారో బెజెల్ స్క్రీన్, 432×514 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 2,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. యూజర్లు తమ ఇష్టానుసారం కస్టమ్ వాచ్ ఫేస్‌లు, ఇంటర్ చేంజబుల్ స్ట్రాప్‌లు మార్చుకునే అవకాశం ఉంది. ఇది బ్లూ రివర్ ఓఎస్ 3.0 పై పనిచేస్తుంది. అలాగే హెల్త్ ఫీచర్లలో భాగంగా.. ఈ వాచ్‌లో ఆప్టికల్ హార్ట్‌రేట్ సెన్సార్, SpO2 (రక్త ఆక్సిజన్) సెన్సార్, అలాగే 100కి పైగా ప్రీసెట్ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా అక్సిలరేషన్ సెన్సార్, జైరోస్కోప్, జియోమాగ్నెటిక్ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, హాల్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 2ATM వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ పొందింది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4, NFC సపోర్ట్ లభిస్తుంది.
Grandma Complaints:ఓట్ల కోసం ఇంటికి వచ్చిన నేతలు.. వెరైటీ కోరిక కోరిన వృద్ధురాలు…
ఇక బ్యాటరీ విషయానికి వస్తే, బ్లూటూత్ వెర్షన్లో 695mAh బ్యాటరీ ఉండగా.. ఇది 33 రోజుల వరకు పనిచేస్తుంది. eSIM వెర్షన్ లో 595mAh బ్యాటరీ ఉంది. దీని బ్యాటరీ లైఫ్ 28 రోజుల వరకు ఉంటుంది. పరిమాణాల పరంగా చూస్తే ఈ వాచ్ 47.54×40.19×10.97mm గా ఉండి, బ్లూటూత్ వెర్షన్ బరువు 35.8 గ్రాములుగా ఉంది. అలాగే eSIM వెర్షన్ బరువు 34.8 గ్రాములుగా ఉంది. ఇక ధర పరంగా చూస్తే Vivo Watch GT 2 బ్లూటూత్ వేరియంట్ ధర CNY 499 (రూ.6,200)గా నిర్ణయించగా, eSIM మోడల్ ధర CNY 699 (రూ.8,700)గా ఉంది. ఈ వాచ్ ఫ్రీ బ్లూ, ఆరిజిన్ బ్లాక్, ఒబిసిడియన్ బ్లాక్, షెల్ పౌడర్, వైట్ స్పేస్ వంటి రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం ఇది చైనాలోని Vivo e-storeలో విక్రయానికి అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?