Vivo V80: వివో V80 Series ధర లీక్.. 7200mAh బ్యాటరీ, Snapdragon 7 Gen 4తో భారత్‌లో త్వరలో లాంచ్?
- వివో V80 Series ధర
- 7200mAh బ్యాటరీ, Snapdragon 7 Gen 4
- వచ్చే నెలలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo V80 Series India Launch: వివో (Vivo) V80 సిరీస్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా వెలుగులోకి వచ్చిన లీకుల ప్రకారం, ఈ సిరీస్ వచ్చే నెలలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధరతో పాటు డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వంటి కీలక ఫీచర్లు కూడా ఆన్లైన్లో లీక్ అయ్యాయి. అయితే, కంపెనీ ఇప్పటివరకు Vivo V80 Seriesకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వెలువడిన వివరాలు టిప్స్టర్లు, లీకుల ఆధారంగానే ఉన్నాయి.
Vivo V80 Series ఎప్పుడు విడుదల?
భారతీయ టిప్‌స్టర్ సంజు చౌదరి వెల్లడించిన సమాచారం ప్రకారం, Vivo V80 Series ఆగస్టు నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో కంపెనీ రెండు లేదా మూడు మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల Vivo V70 Elite విడుదలైన నేపథ్యంలో, తర్వాతి దశలో V80 Elite మోడల్ కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Also Read
- 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
- 45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
- Redmi Turbo 6 Max: రెడ్మీ టర్బో 6 మ్యాక్స్.. 10000mAh బ్యాటరీ, 7-ఇంచెస్ 2K డిస్ప్లేతో వచ్చేస్తోంది!
- Nothing Phone (4b): 6000mAh బ్యాటరీతో.. నథింగ్ ఫోన్ (4బి) భారత్‌లో విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
ధర ఎంత ఉండొచ్చు?
లీకుల ప్రకారం, Vivo V80 Series ధర Oppo Reno 16 Series మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. Oppo Reno 16 సిరీస్ ప్రారంభ ధర రూ. 61,999గా ఉంది. Vivo V80 Seriesలో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ అందించే అవకాశం ఉందని సమాచారం.
అంచనా స్పెసిఫికేషన్లు
లీకుల ప్రకారం Vivo V80 Seriesలో 6.59-అంగుళాల 1.5K డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, 3D ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
7200mAh భారీ బ్యాటరీ
ఈ సిరీస్‌లో 7200mAh సామర్థ్యం గల బ్యాటరీను అందించనున్నట్లు సమాచారం. అలాగే 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ కు మద్దతు ఉండే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ కారణంగా ఎక్కువ బ్యాకప్‌తో పాటు వేగవంతమైన ఛార్జింగ్ అనుభవం లభించవచ్చని అంచనా.
కెమెరా ఫీచర్లు
ఫోటోగ్రఫీ కోసం Vivo V80 Seriesలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. అందులో 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాను అందించే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి.
ఇతర ఫీచర్లు
Vivo V80 Seriesలో IP68 & IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, Android 16 ఆధారిత OriginOS 6, ప్రీమియం డిజైన్, మెరుగైన AI ఫీచర్లు వంటి అంశాలు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
- Tags
- vivo
- Vivo V80 Series
తాజావార్తలు
-
Vivo V80: వివో V80 Series ధర లీక్.. 7200mAh బ్యాటరీ, Snapdragon 7 Gen 4తో భారత్‌లో త్వరలో లాంచ్?
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
Shravana Maasam: శ్రావణ మాస మహోత్సవం.. జూలై 30నా లేక 31నా? శివయ్య భక్తులు నోట్ చేసుకోవాల్సిన పవిత్ర తిథులు ఇవే!
-
Suriya Remuneration: ‘కరుప్పు’ సక్సెస్‌తో 100 కోట్ల క్లబ్‌లోకి సూర్య?
-
Pakistan Cargo Plane Missing: ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం.. అరేబియా సముద్రంపై గల్లంతు
ట్రెండింగ్
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!