144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- వివో T5 Pro 5G భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్
- 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్
- Snapdragon 7s Gen 4 ప్రాసెసర్, 4nm టెక్నాలజీ
- 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సర్, 32MP ఫ్రంట్ కెమెరా
- IP68, IP69 రేటింగ్, MIL-STD-810H డ్యూరబిలిటీ
- 9020mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జింగ్
- ఫోన్ మందం కేవలం 8.25mm, 5 సంవత్సరాల బ్యాటరీ హెల్త్ గ్యారంటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
vivo T5 Pro 5G Launch: వివో నుండి కొత్త T5 సిరీస్‌లో భాగంగా వివో T5 ప్రో 5G (vivo T5 Pro 5G) స్మార్ట్‌ఫోన్ ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ముఖ్యంగా భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మంచి ప్రాసెసర్ వంటి అంశాలు ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నెంచుకొనేలా చేస్తున్నాయి.
AP Census 2027: ఏపీలో సెన్సస్ 2027కు శ్రీకారం.. రేపటి నుంచి హౌస్ లిస్టింగ్ ప్రారంభం.!
Also Read
- OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
- Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
- Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
- డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
వివో T5 ప్రో 5Gలో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో పాటు గరిష్టంగా 5000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే ఇందులోని 2160Hz PWM డిమ్మింగ్‌తో కళ్లకు తక్కువ ఒత్తిడి కలిగేలా డిజైన్ చేశారు. ఈ ఫోన్ లో పర్ఫార్మెన్స్ కోసం Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇది 4nm టెక్నాలజీపై ఆధారపడి సుమారు 1.2 మిలియన్ AnTuTu స్కోర్‌ను సాధిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే 7K VC కూలింగ్ సిస్టమ్ ను కూడా ఇందులో ఉంచారు. దీనితో గేమింగ్ సమయంలో హీట్ కంట్రోల్‌ను మెరుగుపరిచారు. ఈ ఫోన్ 120FPS వరకు గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
కొత్త మొబైల్ లో కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50MP ప్రధాన కెమెరా (Sony IMX882 సెన్సర్, OISతో), 2MP డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాను అందించారు. వీడియో రికార్డింగ్ కోసం 4K సపోర్ట్ కూడా ఉంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. దీనికి 3 సంవత్సరాల OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కంపెనీ హామీ ఇచ్చింది. అలాగే ఈ మొబైల్ IP68, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో బలమైన నిర్మాణాన్ని కలిగి ఉంది.

మొబైల్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 9020mAh భారీ బ్యాటరీ. దీనికి 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 37 నిమిషాల్లో 50% వరకు చార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 8.25mm మాత్రమే ఉండటం విశేషం. అంతేకాదు ఐదు సంవత్సరాల బ్యాటరీ హెల్త్ గ్యారంటీని కూడా అందిస్తున్నారు. ధరల విషయానికి వస్తే ఈ ఫోన్ 3 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 29,999గా నిర్ణయించారు. 8GB + 256GB వేరియంట్ రూ. 33,999 కాగా, 12GB + 256GB టాప్ మోడల్ ధర రూ. 39,999గా ఉంది. ఈ ఫోన్ కాస్మిక్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ రంగులలో లభిస్తుంది.
Vijay: డీలిమిటేషన్‌తో తమిళనాడుకు నష్టం.. పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు
ఈ మొబైల్స్ ఏప్రిల్ 21 నుంచి ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఈ స్టోర్, అలాగే ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ప్రారంభ ఆఫర్లలో భాగంగా Axis, HDFC, SBI బ్యాంక్ కార్డులతో రూ. 3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్ బోనస్ అందిస్తున్నారు. అలాగే 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది.
తాజావార్తలు
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!