ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ థామ్సన్ తన తాజా QLED టీవీని భారత మార్కెట్ లో విడుదల చేసింది. ఇది జియోటెలీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే మొట్టమొదటి 43 అంగుళాల క్యూలెడ్ స్మార్ట్ టీవీ. JioTele OS తో వస్తున్న తొలి స్మార్ట్ టీవీ ఇదే. పవర్ పీచర్లతో వస్తున్న ఈ టీవీ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. లాంచ్ ఆఫర్ కింద, కంపెనీ ఈ టీవీతో జియోహాట్‌స్టార్, జియోసావన్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. దీనితో పాటు, జియోగేమ్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.
Also Read:Tragedy: పోలవరం కాలువలో పడి ఇద్దరు యువకులు మృతి..
థామ్సన్ కొత్త QLED టీవీ 43-అంగుళాల స్క్రీన్ సైజుతో వస్తుంది. దీనిలో మీరు HDR సపోర్ట్, 4K రిజల్యూషన్, 500 Nits బ్రైట్ నెస్ తో వస్తుంది. ఈ టీవీ స్లిమ్ బెజెల్స్, అల్లాయ్ స్టాండ్ తో వస్తుంది. దీనికి అమ్లాజిక్ ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్ టీవీ 2GB RAM, 8GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ టీవీలో 40W స్టీరియో స్పీకర్‌ను అమర్చారు. ఇది డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ టీవీలో మీరు స్టాండర్డ్, స్పోర్ట్, మూవీ, మ్యూజిక్ వంటి సౌండ్ మోడ్‌లను పొందుతారు.
Also Read:IND vs PAK: తొలి ఓవర్‌తో షమీ పేరిట చెత్త రికార్డు..
కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇందులో బ్లూటూత్ 5.0, మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు ఉన్నాయి. ఈ టీవీలో జియో స్టోర్ సాయంతో అనేక యాప్‌లు, OTT ప్లాట్‌ఫారమ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ AI ఆధారిత కంటెంట్ ను ఇస్తుంది. ఈ థామ్సన్ టీవీలో నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, యూట్యూబ్ కోసం ప్రత్యేక బటన్‌లను కూడా ఇచ్చారు. రిమోట్ HelloJio యాక్సెస్‌తో వస్తుంది. దీని సాయంతో 10 కంటే ఎక్కువ భాషలలో కంటెంట్‌ను సెర్చ్ చేయొచ్చు.