మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ వాచ్ లు వస్తున్నాయి.. కొన్ని ఫీచర్స్ బాగుంటే మరికొన్ని వాచ్ లు చూడటానికి చాలా బాగుంటాయి.. అలాంటి స్మార్ట్ లుక్ లో అదిరిపోయే ఫీచర్ల తో మరో కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది.. అదే కల్ట్ డాట్ స్పోర్ట్ యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్..2.01 అంగుళాల స్క్వేర్ డయల్ 240 x 296 పిక్సెల్ హెచ్ డీ డిస్‌ప్లే సన్నని బెజెల్‌లతో వస్తుంది.. ఇది చూడటానికి అచ్చం యాపిల్ స్మార్ట్ వాచ్ లాగే ఉంటుంది..200+ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లకు కూడా ఇది మద్దతు ఇస్తుంది. ఈ సింగిల్-చిప్ బ్లూటూత్ కు మద్దతు ఇస్తుంది. డిజిటల్ మైక్రోఫోన్, స్పీకర్‌తో అనుబంధంగా ఉంటుంది. వన్-ట్యాప్ పెయిరింగ్, క్విక్ యాక్సెస్ డయల్‌ప్యాడ్ వంటి కొన్ని ఫీచర్లు ఉన్నాయి..
ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే గరిష్టంగా 7 రోజుల స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుంది. అవసరమైనప్పుడు, 90 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.. ఈ స్మార్ట్ వాచ్ లో 100 స్పోర్ట్స్ మోడ్‌లు ఉంటాయి. రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటి వ్యాయామాలను ట్రాక్ చేయవచ్చు. మీ ప్రోగ్రెస్, మెట్రిక్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీరు కల్ట్ స్పోర్ట్ వాచ్ యాప్ ను వినియోగించుకోవచ్చు. ఇంకా, మీ ఫిట్‌నెస్ కు సంబందించి కూడా ఆఫ్షన్ కూడా ఉంటుందిదీనిలో బ్లడ్ ప్రెజర్ మానిటర్, హార్ట్ రేట్ సెన్సార్, ఆక్సిజన్ సెన్సార్, స్లీప్ ట్రాకింగ్, పీరియడ్ ట్రాకింగ్ తో పాటు మరెన్నో ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి..
కల్ట్ డాట్ స్పోర్ట్ యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్ వాస్తవ ధర రూ. 2,499. కాగా ప్రారంభ ఆఫర్ కింద రూ. 1,599 కే దీనిని కొనుగోలు చేయొచ్చు. మీరు దీన్ని కల్ట్ డాట్ స్పోర్ట్ వెబ్‌సైట్, ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేయొచ్చు.. ఈ వాచ్ ప్రస్తుతం గ్రే, బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది.. ఈ వాచ్ కు వాటర్ ప్రూఫ్ కూడా ఉందని చెబుతున్నారు..ఆన్ లైన్ లో ఆఫర్ కూడా ఉంది.. మీకు నచ్చితే ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి…