Smartphone Price Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smartphone Price Hike: మీరు గత కొన్ని నెలలుగా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్. ఇండియన్ మార్కెట్లో ప్రముఖ బ్రాండ్లు అయిన వన్‌ప్లస్ (OnePlus), నథింగ్ (Nothing), రెడ్మీ (Redmi), రియల్మీ (Realme), మోటోరోలా వంటి కంపెనీలు తమ ఫోన్ల ధరలను సైలెంట్‌గా పెంచేస్తున్నాయి. కొన్ని మోడళ్లపై రూ.2 వేల నుంచి రూ.6 వేల వరకు ధరలు పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్మార్ట్‌ఫోన్ ధరలు అకస్మాత్తుగా పెరగడానికి ప్రధాన కారణం టెక్ ప్రపంచంలో వినిపిస్తున్న ‘RAMageddon’ అనే పదం అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా RAM, స్టోరేజ్ చిప్స్ (NAND chips) కొరత తీవ్రంగా ఉంది. ఈ చిప్స్ తయారీలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కంపెనీలకు మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.
AI ప్రభావం:
OpenAI, Google, Microsoft వంటి దిగ్గజాలు భారీ AI డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. వీటికి అత్యధిక నాణ్యత కలిగిన మెమరీ చిప్స్ అవసరం. గతంలో మొబైల్ ఫోన్ల కోసం చిప్స్ తయారు చేసిన ఫ్యాక్టరీలు ఇప్పుడు తమ ప్రాధాన్యతను AI వైపు మళ్లించాయి. డిమాండ్ పెరిగి సరఫరా తగ్గడంతో మెమరీ చిప్స్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల కంపెనీలు ఆ భారాన్ని కస్టమర్లపై వేయక తప్పడం లేదని నథింగ్ సీఈఓ కార్ల్ పీ వంటి వారు చెబుతున్నారు. భారత మార్కెట్లో ఇప్పటికే ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. OnePlus 15 లాంచ్ సమయంలో రూ.72,999 ఉన్న ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.77,999 కి చేరింది. అంటే దాదాపు రూ. 5 వేల పెరిగింది. Nothing Phone 4a Pro రూ.39,999 నుంచి రూ.44,999 కి పెరిగింది. బడ్జెట్ ఫోన్లు అయిన రెడ్మీ, రియల్మీ వంటి బ్రాండ్లు కూడా రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ధరలను పెంచాయి.
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. 2026 నాటికి స్మార్ట్ఫోన్ల సగటు విలువ మరో 7 శాతం పెరిగే అవకాశం ఉందట. రాబోయే రోజుల్లో ఫోన్ల ధరలు 20% నుంచి 40% వరకు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఫోన్లలో ఈ ప్రధాన మార్పులు ఇవే ఉండొచ్చని చెబుతున్నారు. తక్కువ లాభం వచ్చే బడ్జెట్ ఫోన్ల తయారీని కంపెనీలు తగ్గించి, ఎక్కువ ధర ఉండే ప్రీమియం ఫోన్లపై దృష్టి పెట్టే అవకాశం ఉందట. కొత్త ఫోన్ల ధరలు భారం కావడంతో రీఫర్బిష్డ్ (Refurbished) లేదా పాత ఫోన్ల మార్కెట్‌కు గిరాకీ పెరగవచ్చని చెబుతున్నారు. మధ్యతరగతి ప్రజలు (రూ. 15 వేల నుంచి రూ.30 వేల సెగ్మెంట్) కొత్త ఫోన్ కొనాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ చిప్స్ కొరత సమస్య 2027 వరకు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఫోన్ కొనే ప్లాన్ ఉంటే ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
- Tags
- AI
- OnePlus
- SMARTPHONES
- technews
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!