Site icon NTV Telugu

Samsung India: ‘శామ్‌సంగ్‌ ఇండియా’ ఖుషీ ఖుషీ. గత ఐదేళ్లలో ఎప్పుడూలేనంత..

Samsung India

Samsung India

Samsung India: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్‌సంగ్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత అధిక ఆదాయం ఈ సంవత్సరం సమకూరింది. ఇతర ఆదాయం ఏకంగా 78 శాతం (రూ.2873.20 కోట్లకు) పెరగటంతో ఈ వృద్ధి నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.75,886 కోట్లు కాగా ఈసారి రూ.82,451 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంటే.. గతేడాది కన్నా ఇప్పుడు 8.65 శాతం గ్రోత్‌ సాధించింది. ఇదిలాఉండగా శామ్‌సంగ్‌ ఇండియాకి నెట్‌ ప్రాఫిట్‌ 4.86 శాతం తగ్గింది. సుమారు రూ.4,041 కోట్ల నుంచి రూ.3,844 కోట్లకు పరిమితమైంది.

Diwali Gold Sales: పండుగ చేసుకుంటున్న బంగారం వ్యాపారులు

మొబైల్‌ హ్యాండ్‌సెట్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు తదితర ఉత్పత్తులను తయారుచేసే శామ్‌సంగ్‌ ఇండియాకి సంబంధించిన ఈ విషయాలను టోఫ్లర్‌ అనే రీసెర్చ్‌ సంస్థ వెల్లడించింది. 2020-21లో శామ్‌సంగ్‌ ఇండియా మొత్తం ఆదాయం రూ.77,501.40 కోట్లు కాగా 2021-22లో 10.09 శాతం పెరిగింది. ఇదే సమయంలో మొత్తం ఖర్చులు కూడా తడిసి మోపెడయ్యాయి. రూ.71,899 కోట్ల నుంచి 10.93 శాతం అధికమై రూ.79,758.90 కోట్లకు చేరుకున్నాయి.

శామ్‌సంగ్‌ 1995లో ఇండియాలోకి ప్రవేశించింది. న్యూఢిల్లీకి దగ్గరలోని నోయిడాతోపాటు తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రెండు ఫ్యాక్టరీలను ఏర్పాటుచేసింది. ఐదు ఆర్‌ అండ్‌ డీ సెంటర్లు, ఒక డిజైన్‌ సెంటర్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది. 2 లక్షలకు పైగా ఉన్న రిటైల్‌ ఔట్‌లెట్లు, 3 వేలకు పైగా ఉన్న కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్లు వీటికి అదనం.

Exit mobile version