Galaxy S26 Series Price: ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ S26 సిరీస్ ధరలు ఇవే.. టాప్ ఎండ్‌కు మతిపోయే ప్రైస్!
- గెలాక్సీ S26 అల్ట్రా, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 లాంచ్
- ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ S26 సిరీస్ ధరలు ఇవే
- ప్రత్యేక ఆకర్షణగా 'ప్రైవసీ డిస్ప్లే' ఫీచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy S26 India Price: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ‘శాంసంగ్’.. తన తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన ‘గెలాక్సీ S26’ సిరీస్ భారత మార్కెట్ ధరలను అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో గెలాక్సీ S26 అల్ట్రా, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 మోడల్స్‌తో పాటు కొత్త వైర్లెస్ ఇయర్‌బడ్‌లు కూడా విడుదల చేయడం విశేషం. అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు, హైఎండ్ కెమెరా సెటప్‌తో ఈ సిరీస్ టెక్ ప్రపంచంలో చర్చకు దారి తీసింది. ప్రీమియం సెగ్మెంట్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఈ డివైస్‌లు.. అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ప్రైవసీ డిస్ప్లే’ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
గెలాక్సీ S26 అల్ట్రా మోడల్లో 256GB వేరియంట్ ధర రూ.1,39,999 కాగా.. 512GB వేరియంట్ ధర రూ.1,59,999గా కంపెనీ ప్రకటించింది. టాప్ ఎండ్ 16GB + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,89,999గా ఉంది. గెలాక్సీ S26 ప్లస్ 256GB వేరియంట్ రూ.1,19,999 కాగా.. 512GB వేరియంట్ రూ.1,39,999. సాధారణ గెలాక్సీ S26 మోడల్ 256GB ధర రూ.87,999 కాగా, 512GB వేరియంట్ ధర రూ.1,07,999గా ఉంది.
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- 8849 Tank 5: ప్రొజెక్టర్‌తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
గెలాక్సీ బడ్స్ 4 ధర రూ.16,999గా ఉండగా, బడ్స్ 4 ప్రో ధర రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీ కొన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. 256GB ధరకు 512GB వేరియంట్‌ను పొందే అవకాశం, బండిల్‌గా బడ్స్ 4 కొనుగోలు చేస్తే రూ. 3,500 తగ్గింపు, విడిగా కొనుగోలు చేసినా రూ.2,000 వరకు డిస్కౌంట్ వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త గెలాక్సీ S26 సిరీస్ స్మార్ట్‌ఫోన్ డెలివరీలు మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!