Ryan Dahl: ప్రశ్నార్థకంగా “సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల” భవిష్యత్తు..
- ప్రశ్నార్థకంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల భవిష్యత్తు..
- కోడ్ రాయడం ఏఐకి వదిలేయాలంటున్న ర్యాన్ డాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ryan Dahl: AI అభివృద్ధి మొత్తం టెక్ రంగాన్ని మార్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. క్లాడ్ కోడ్ వంటి కోడింగ్ పనుల్ని ఏఐ సాధారణాలు సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, కోడర్ల మాదిరిగానే చక్కబెట్టేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పనిని కూడా ఏఐ నిర్వహించేలా పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా NodeJS క్రియేటర్, ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ర్యాన్ డాల్ చేసిన వ్యాఖ్యలు, టెక్కీల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వర్డ్స్, కమాండ్స్ రాయడానికి బదులుగా కొత్త ఐడియాలు, కాన్సెప్ట్స్, డిజైన్‌లపై ఇంజనీర్లు దృష్టి పెట్టాలని, కోడింగ్ ఏఐ టూల్స్‌కు వదిలేయాలని అన్నారు.
Also Read
- Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
ఎక్స్ పోస్టులో ‘‘ మానవులు కోడ్‌ను రాసే యుగం ముగిసింది’’ అని డాల్ పేర్కొన్నారు. అయితే, పూర్తిగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అవసరం లేకుండా పోతుందని ఆయన చెప్పలేదు. కానీ, ఇకపై కోడ రాయడం ఇంజనీర్ ప్రధాన పని కాదని చెప్పకనే చెబుతున్నారు. సిస్టమ్ ఆర్కటెక్చర్ డిజైన్, ఏఐ రూపొందిని కోడ్ సరిగా ఉందో లేదో రివ్యూ చేయడం, అవుట్‌పుట్ సరిగా ఉందో లేదో చూడటం, క్లిష్టమమైన సాంకేతిక నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఇంజనీర్ల ప్రధాన విధులుగా మారుతాయని ఆయన చెబుతున్నారు.
డాల్ చెప్పినవి ఇప్పటికే వాస్తవ రూపం దాలుస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు తమ ప్రొడక్షన్ కోడ్‌లో సుమారుగా 30 శాతం AI ద్వారానే రాస్తు్న్నామని ప్రకటించాయి. క్లాడ్ కోడ్ వెనక ఉన్న కోడ్‌లో దాదాపుగా 80 శాతం AI ద్వారానే రూపొందుతోంది. అయితే, ఈ మార్పులు కేవలం కోడింగ్‌కు మాత్రమే పరిమితం కాదని ప్రముఖ ఏఐ సైంటిస్ట్ జెఫ్రీ హింటన్ (ఏఐ గాడ్‌ఫాదర్) హెచ్చరిస్తున్నారు. 2026 నాటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు పోవచ్చని చెబుతున్నారు. AI చాలా తక్కువ సమయంలోనే పనిని పూర్తి చేసే స్థాయికి చేరుకుందని చెప్పారు. మనుషులకు నెలలు పట్టే ప్రాజెక్టుల్ని ఏఐ కేవలం రోజులు లేదా గంటల్లో పూర్తి చేయగలదని అన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇప్పుడు కేవలం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై ఆధారపడితే ప్రమాదమని, ఉద్యోగ భవిష్యత్తు కోసం మరింత కొత్త టెక్నాలజీ, మరింత అవగాహన పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
🚨Ryan Dahl – the creator of Nodejs recently tweeted that “the era of humans writing the code is over”
🎯Anthropic sweeps the enterprise AI market— driven by dominance in the crucial enterprise coding market where they hold over 50% share, making them the top choice for… pic.twitter.com/6rvDUDe9t0
— Sandeep Anand (@SanCompounding) January 20, 2026
తాజావార్తలు
-
OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
-
Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
-
Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!