Redmi Turbo 5 Max: షియోమీకి చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మీ తన కొత్త Redmi Turbo 5 సిరీస్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో తొలిసారి Redmi Turbo 5 Max అనే సరికొత్త మోడల్ ను కూడా లాంచ్ చేయబోతుంది అని రెడ్‌మీ అధికారిక Weibo పోస్టు ద్వారా వెల్లడించింది. అయితే, Redmi Turbo 5 Max ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ కానుంది. అయితే, ఖచ్చితమైన రిలీజ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. టీజర్‌లో తెలిపిన ధర..ఈ ఫోన్ CNY 2,500 (భారత కరెన్సీలో సుమారు ₹33,000) వరకు ఉండే అవకాశం ఉంది. కాగా, ఈ ఫోన్ బ్యాటరీ అత్యుత్తమ పనితీరు, ఫ్లాగ్‌షిప్ స్థాయి స్పీడ్, మల్టీటాస్కింగ్ సామర్థ్యం ఉంటాయని రెడ్ మీ కంపెనీ తెలిపింది.
Read Also: OTT : హనీమూన్ సే హత్య – డ్రమ్ములో భర్త శవం ముక్కలు – రియల్ క్రైమ్ స్టోరీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టర్బో ఫ్యామిలీలో కొత్త ‘మ్యాక్స్’ వేరియంట్
ఇప్పటి వరకు రెడ్‌మీ టర్బో సిరీస్‌లో Turbo, Turbo Pro మోడళ్లే ఉన్నాయి. కానీ ఇప్పుడు Turbo 5 Max పేరుతో కొత్త వేరియంట్‌ను పరిచయం చేస్తూ, సిరీస్‌ను మరింత విస్తరించబోతుంది. గతంలో Redmi Turbo 4 2025 జనవరిలో చైనాలో విడుదల కాగా, Turbo 4 Pro ఏప్రిల్‌లో లాంచ్ అయింది.
Read Also: TheRajaSaab : రాజాసాబ్.. నాచే నాచే సాంగ్.. రాసి పెట్టుకోండి.. థియేటర్లు తగలబడిపోతాయ్!
చిప్‌సెట్ వివరాలు (లీక్స్ ఆధారంగా)
* రెడ్‌మీ టర్బో 5- మీడియాటెక్ డైమెన్సిటీ 8500
* రెడ్‌మి టర్బో 5 ప్రో – మీడియాటెక్ డైమెన్సిటీ 9500e.. కానీ ఈ రెండు చిప్‌సెట్లు ఇప్పటికీ MediaTek సంస్థ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.
3C సర్టిఫికేషన్‌లో కనిపించిన Turbo 5 Pro
ఇటీవల Redmi Turbo 5 Pro, చైనాలోని 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో 2602BRT18C మోడల్ నంబర్‌తో లిస్ట్ అయింది. దీని ఆధారంగా ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి.
అంచనా స్పెసిఫికేషన్లు:
* 9,000mAh భారీ బ్యాటరీ
* 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
స్టాండర్డ్ Redmi Turbo 5:
8,000mAh బ్యాటరీ
100W ఫాస్ట్ ఛార్జింగ్
డిస్‌ప్లే వివరాలు (అంచనా)
6.5 అంగుళాల LTPS ఫ్లాట్ డిస్‌ప్లే
1.5K రిజల్యూషన్
గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు అనువుగా స్క్రీన్ నాణ్యత ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి.
Xiaomi 17 Ultraతో కలిసి లాంచ్ అవుతుందా?
అయితే, Redmi Turbo 5 సిరీస్‌ను Xiaomi 17 Ultra మోడల్‌తో పాటు లాంచ్ చేయవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు రెడ్‌మీ నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు. ఇక, Redmi Turbo 5 సిరీస్, ముఖ్యంగా Turbo 5 Max, భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, హై-పర్ఫార్మెన్స్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తోంది.