Site icon NTV Telugu

7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Redmi Note 15 Pro+, Note 15 Pro స్మార్ట్ఫోన్స్ లాంచ్

Redmi Note 15 Pro+

Redmi Note 15 Pro+

Redmi Note 15 Pro+, Note 15 Pro: రెడ్మీ తన కొత్త సిరీస్ రెడ్మీ నోట్ 15 ప్రో+ (Redmi Note 15 Pro+), రెడ్మీ నోట్ 15 ప్రో (Redmi Note 15 Pro) స్మార్ట్‌ఫోన్లను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ లో ప్రధానంగా 7,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ (ప్రో+ మోడల్), 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ లని చెప్పవచ్చు. మరి ఈ రెండు మొబైల్స్ సంబంధించిన మిగితా స్పెసిఫికేషన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాము.

రెడ్మీ నోట్ 15 ప్రో+ స్పెసిఫికేషన్స్:
డిస్‌ప్లే: 6.83-అంగుళాల మైక్రో-కర్వ్డ్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, షావోమి డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ రక్షణ.

ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 – ఈ చిప్‌సెట్‌తో వచ్చిన మొట్టమొదటి ఫోన్.

ర్యామ్,స్టోరేజ్: 16GB LPDDR4X వరకు RAM, 512GB UFS2.2 స్టోరేజ్.

కెమెరా: వెనుక భాగంలో 50MP Light Fusion 800 సెన్సార్ + 50MP టెలిఫోటో + 8MP అల్ట్రావైడ్, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా.

సెక్యూరిటీ: ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్.

కనెక్టివిటీ: 5G, Wi-Fi 6, NFC, Bluetooth 5.4, GPS, గెలీలియో, గ్లోనాస్, బెయిడౌ, USB Type-C

బ్యాటరీ: 7,000mAh, 90W ఫాస్ట్ ఛార్జింగ్ + 22.5W రివర్స్ ఛార్జింగ్, Xiaomi Surge P3 ఛార్జింగ్ చిప్, Surge G1 ఫ్యూయల్ గేజ్.

Illegal Sand Smuggling: పుష్ప సినిమా స్టైల్‌లో ఇసుక స్మగ్లింగ్.. లారీ టైరు పేలడంతో పోలీసులకు చిక్కిన డ్రైవర్!

రెడ్మీ నోట్ 15 ప్రో స్పెసిఫికేషన్స్:
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా.

కెమెరా: వెనుక భాగంలో 50MP Sony LYT-600 సెన్సార్ + 8MP Sony IMX355 అల్ట్రావైడ్ కెమెరా.. ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా

బ్యాటరీ: 7,000mAh, 45W ఫాస్ట్ ఛార్జింగ్ + 22.5W రివర్స్ ఛార్జింగ్.

మిగతా స్పెసిఫికేషన్స్ ప్రో+ మోడల్‌ మాదిరిగానే ఉంటాయి.

ప్రత్యేక ఎడిషన్ లో భాగంగా రెడ్మీ నోట్ 15 ప్రో+ ను సాటిలైట్ మెసేజింగ్ వెర్షన్ ను లాంచ్ చేశారు. ఇందులో సెల్యులార్ నెట్‌వర్క్ లేకపోయినా బెయిడౌ ఆధారిత ఎమర్జెన్సీ మెసేజింగ్ సదుపాయం కల్పించారు.

Bhadrachalam Flood Update: శాంతిస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద 49 అడుగుల నీటిమట్టం!

ధరలు:
రెడ్మీ నోట్ 15 ప్రో+:
* 12GB + 256GB – CNY 1,899 (రూ.23,000 సుమారు)

* 12GB + 512GB – CNY 2,099 (రూ.25,000 సుమారు)

* 16GB + 512GB – CNY 2,299 (రూ.28,000 సుమారు)

* సాటిలైట్ మెసేజింగ్ ఎడిషన్ (16GB + 512GB) – CNY 2,399 (రూ.29,000 సుమారు)

రంగులు: సీడార్ వైట్, మిడ్నైట్ బ్లాక్, స్కై బ్లూ, స్మోకీ పర్పుల్.

రెడ్మీ నోట్ 15 ప్రో:
* 8GB + 256GB – CNY 1,399 (రూ.17,000 సుమారు)

* 12GB + 256GB – CNY 1,599 (రూ.20,000 సుమారు)

* 12GB + 512GB – CNY 1,799 (రూ.22,000 సుమారు)

*రంగులు: సీడార్ వైట్, క్లౌడ్ పర్పుల్, మిడ్నైట్ బ్లాక్, స్కై బ్లూ.

మొత్తంగా రెడ్మీ నోట్ 15 ప్రో+ ప్రీమియం ఫీచర్లతో వస్తుండగా, రెడ్మీ నోట్ 15 ప్రో కూడా మంచి బ్యాటరీ, ప్రాసెసర్, కెమెరా పనితీరుతో మిడ్-రేంజ్ వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

Exit mobile version