Realme Narzo 90x: 12 గంటల్లోనే లక్ష యూనిట్ల అమ్మకాలు.. ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌కు సూపర్ క్రేజ్ గురూ!
- రియల్‌మీ నార్జో సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
- మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో నార్జో 90, నార్జో 90 ఎక్స్
- అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్‌గా నార్జో 90 ఎక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన నార్జో సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను గత వారం భారత మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో రియల్‌మీ నార్జో 90, రియల్‌మీ నార్జో 90 ఎక్స్ పేరిట సరికొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు డిసెంబర్ 24 నుంచి ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఫోన్స్ అమ్మకాలల్లో రికార్డు నెలకొల్పాయి.
రియల్‌మీ నార్జో 90, రియల్‌మీ నార్జో 90 ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లు 12 గంటల్లోనే లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని రియల్‌మీ కంపెనీ అధికారికంగా తెలిపింది. అమెజాన్‌లో నార్జో 90 ఎక్స్ బెస్ట్ సెల్లర్‌గా ఉందని పేర్కొంది. ఈ 5జీ ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో వచ్చింది. నార్జో 90 ఎక్స్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0తో పనిచేస్తుంది. ఇందులో 6.80 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ ఉండగా.. 200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 144Hz రిఫ్రెష్ రేటుకు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్‌సిటీ 6,300 ప్రాసెసర్‌ను ఇచ్చారు.
Also Read
- iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
- Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
- Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
Also Read: Dhurandhar 2 Release: పెద్ద ప్లానింగే.. 5 భాషలలో ‘ధురంధర్-2’ విడుదల!
రియల్‌మీ నార్జో 90 ఎక్స్‌లో 50 ఎంపీ ప్రధాన కెమెరా ఉండగా.. 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 60W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఐపీ65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో ఈ ఫోన్ వచ్చింది. బ్లూటూత్ 5.3, డ్యూయల్ బ్యాండ్ వైఫై వంటి ఫీచర్స్ ఉన్నాయి. నార్జో 90 ఎక్స్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,999గా ఉండగా.. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,499గా ఉంది. ఇది నైట్రో బ్లూ, ఫ్లాష్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్ కింద నార్జో 90 ఎక్స్‌పై మీరు రూ.2,000 ఆదా చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
-
Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్‌వేర్’ గుర్తింపు!
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..