‘Urban Wild Design’ కాన్సెప్ట్‌తో కొత్త Realme 16 Pro Series.. మెరిసిపోనున్న మొబైల్ బ్యాక్ గ్రౌండ్స్..!
- Realme 16 Pro సిరీస్ కోసం
- మరోసారి రియల్‌మీ, ప్రముఖ ఇండస్ట్రియల్ డిజైనర్ నావోటో ఫుకసావాతో భాగస్వామ్యం.
- ఈ సిరీస్‌కు పరిచయం చేసిన కొత్త డిజైన్ కాన్సెప్ట్ పేరు “Urban Wild Design”.
- ప్రకృతి టెక్స్చర్‌లు, ఆధునిక నగర శైలిని మిళితం చేయడమే ఈ డిజైన్ ప్రత్యేకత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme 16 Pro Series: టీజర్ల తర్వాత రియల్‌మీ (Realme) ప్రముఖ ఇండస్ట్రియల్ డిజైనర్ నావోటో ఫుకసావా (Naoto Fukasawa)తో తన భాగస్వామ్యాన్ని మరోసారి అధికారికంగా ప్రకటించింది. రియల్‌మీ X, X2 Pro, GT సిరీస్‌ల తర్వాత ఇప్పుడు రాబోయే realme 16 Pro సిరీస్ కోసం ఈ సహకారం కొనసాగుతోంది. ఈసారి రియల్‌మీ పరిచయం చేస్తున్న కొత్త డిజైన్ కాన్సెప్ట్ పేరు “Urban Wild Design”. Realme 16 Pro సిరీస్ డిజైన్ ప్రకృతి స్పర్శను ఆధునిక నగర శైలితో మేళవించడం ప్రత్యేకత. కంపెనీ తెలిపిన ప్రకారం ‘Urban Wild’ కాన్సెప్ట్ ప్రకృతిని గుర్తు చేసే టెక్స్చర్ లైన గోధుమ పొలాలు, నదీ రాళ్ల వంటి అనుభూతిని స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో కలపడం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఈ సిరీస్‌లో ముఖ్యంగా బయో-బేస్డ్ ఆర్గానిక్ సిలికాన్ మెటీరియల్ ను వినియోగించారు. ఇది పునరుత్పాదక మొక్కల ఆధారిత స్ట్రా నుంచి తయారు చేయబడింది. ఈ మెటీరియల్ సాఫ్ట్ టచ్ అనుభూతిని అందిస్తూనే, దీర్ఘకాలిక మన్నికను కూడా కలిగి ఉంటుంది. రియల్‌మీ ప్రకారం ఇది ఏజింగ్, మురికి, బ్యాక్టీరియా, అబ్రేషన్లకు మంచి రెసిస్టెన్స్ ఇస్తుంది. ఈ రాబోయే Realme 16 Pro సిరీస్‌లో “All-Nature Curve” డిజైన్ ను ఉపయోగించారు. ఇది బ్యాక్ ప్యానెల్ నుంచి డిస్‌ప్లే వరకు ఉండనుంది. ఈ కొత్త డిజైన్ ఉన్నప్పటికీ ఫోన్ 8.49 మిమీ మందంతో స్లిమ్ ప్రొఫైల్ ను నిలుపుకుంది.
IP68+IP69 రేటింగ్స్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g Power (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
ఈ సిరీస్‌లో మల్టీ-డైమెన్షనల్ కలర్ ట్యూనింగ్‌తో నాలుగు ప్రత్యేక రంగులను అందిస్తున్నారు. అయితే రంగుల లభ్యత మోడల్‌ను బట్టి మారుతుంది.
Master Gold: గోధుమ ధాన్యపు టెక్స్చర్ నుంచి ప్రేరణ పొందిన ఈ రంగు Realme 16 Pro+, Realme 16 Pro రెండింటికీ అందుబాటులో ఉంటుంది.
Master Grey: నదిలో పాలిష్ అయిన రాళ్ల రూపాన్ని ప్రతిబింబించే ఈ రంగు Realme 16 Pro+కు మాత్రమే ప్రత్యేకం.
Camellia Pink: భారతీయ పండుగల పూల నుంచి ప్రేరణ పొందిన ఈ కలర్ కూడా Realme 16 Pro+కు మాత్రమే లభిస్తుంది.
Orchid Purple: భారతీయ ఉత్సవాల వైభవాన్ని ప్రతిబింబించే ఈ రంగు realme 16 Proకు మాత్రమే ప్రత్యేకం.
కెమెరా మాడ్యూల్ & బిల్డ్ క్వాలిటీ:
ఫోన్ వెనుక భాగంలో “Metal Mirror Camera Deco” ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది Luxury PVD (Physical Vapor Deposition) టెక్నాలజీతో తయారై, హై-గ్లోస్ మిర్రర్ ఫినిష్‌ను అందిస్తుంది. స్క్రాచ్ రెసిస్టెన్స్ కోసం నానో-స్కేల్ మెటల్ కోటింగ్ ను కూడా ఉపయోగించారు. కెమెరా సెటప్‌ను “Volcanic Camera Deco” డిజైన్ లో అమర్చారు. ఇది బ్యాక్ ప్యానెల్‌తో సహజంగా కలిసిపోయేలా ఉండటంతో పాటు, మెటాలిక్ మిడ్-ఫ్రేమ్‌తో కలిపి స్ట్రక్చరల్ బలాన్ని, డిజైన్ బ్యాలెన్స్‌ను అందిస్తుంది.
Smart Phone Price Hike: మొబైల్ ఫోన్లు కొనేవారికి బిగ్ షాక్..
realme 16 Pro సిరీస్‌లో LumaColor IMAGE టెక్నాలజీతో పాటు Urban Wild Design ఉండటం ఖరారైంది. అయితే అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ సిరీస్‌ను 2026 జనవరి ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది.

తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..