Realme 15 Pro 5G Game of Thrones Limited Edition: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మీ (Realme) భారత్‌లో కొత్త Realme 15 Pro 5G Game of Thrones Limited Edition ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయబోతోంది. కంపెనీ ఇప్పటికే ఈ ప్రత్యేక ఎడిషన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. అయితే ధర, లాంచ్ తేదీ, పూర్తిస్థాయి వివరాలను ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది జూలైలో భారత్‌లో విడుదలైన స్టాండర్డ్ Realme 15 Pro 5G మోడల్‌కి సమానమైన స్పెసిఫికేషన్లతో, కొత్త కలర్ వేరియంట్‌లో ఈ స్పెషల్ ఎడిషన్ రానున్నట్లు తెలుస్తుంది.
Election Code Cash Limit: అమలులో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్.. రూ.50,000 నగదు మాత్రమే అనుమతి
Realme 15 Pro 5G Game of Thrones Limited Edition ధర, లాంచ్ తేదీపై కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వలేదు. అయితే ఇది సాధారణ మోడల్‌తో సమాన ధరలో ఉండే అవకాశం ఉంది. జూలైలో విడుదలైన స్టాండర్డ్ మోడల్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 31,999 ధరకు లభించింది. అలాగే 8GB + 256GB వేరియంట్ రూ. 33,999, 12GB + 256GB వేరియంట్ రూ. 35,999, 12GB + 512GB వేరియంట్ రూ. 38,999 వేరియంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లోఇంగ్ సిల్వర్, వెల్వెట్ గ్రీన్, సిల్క్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో విక్రయించబడుతోంది.

Realme 15 Pro 5G Game of Thrones Limited Edition కూడా జూలైలో విడుదలైన మోడల్‌లా సమానమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే (2800×1280 పిక్సెల్స్ రిజల్యూషన్) ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2,500Hz టచ్ శాంప్లింగ్ రేట్, 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఇక డిస్ప్లేకు Corning Gorilla Glass 7i రక్షణ ఉంటుంది.
మూడు సిమ్ కార్డ్స్.. సింగల్ రీఛార్జ్.. Jio మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
అలాగే ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ Snapdragon 7 Gen 4 SoC ద్వారా పనిచేస్తుంది. దీని తోడు గరిష్టంగా 12GB LPDDR4X ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజ్ లభిస్తుంది. కెమెరా సెటప్‌లో 50MP Sony IMX896 ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా 50MP సామర్థ్యంతో వస్తుంది. ఇక బ్యాటరీ పరంగా చూస్తే.. ఈ ఫోన్‌లో 7,000mAh బ్యాటరీ ఉంది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్స్‌తో నీరు, దుమ్ము నిరోధకతను అందిస్తుంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కలదు. కనెక్టివిటీ పరంగా 5G, 4G, Wi-Fi, Bluetooth 5.4, GPS, USB Type-C సపోర్ట్ లభిస్తుంది.