ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు లేని ఇల్లు లేదు. ఒక్కో ఇంట్లో ఐదారు, ఒక్కొక్కరి దగ్గర రెండుమూడు స్మార్ట్ ఫోన్లు వుంటున్నాయి. అయితే చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధానమయిన సమస్య బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు ఎక్కువ సేపు ఉండవు. స్మార్ట్ ఫోన్ లో బ్యాక్ గ్రౌండ్ లో అనేక యాప్స్ రన్నింగ్ లో ఉంటాయి. దీంతో యాప్ ను ఓపెన్ చేయకున్నా కూడా ఛార్జింగ్ తగ్గిపోతూ వుంటుంది. ఇంటిదగ్గర ఉన్నప్పుడు పర్లేదు కానీ..ప్రయాణాల్లో వున్నప్పుడు ఛార్జింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బందే.
ప్రయాణాల్లో ప్రతిసారీ పవర్ బ్యాంక్ ను తీసుకెళ్లాలంటే కష్టం. ఫోన్ బ్యాటరీ లైఫ్ ను పెంచుకోవడం ఎంతో అవసరం. మీరు ఫోన్ ను ఎంత వాడినా.. బ్యాటరీ లైఫ్ బాగుంటే.. చాలా గంటల పాటు ఫోన్ లో చార్జింగ్ ఉంటుంది.
* మీ ఫోన్ ఛార్జింగ్ 20 శాతానికి వస్తుందో.. అంతే వెంటనే మీ ఫోన్ లో ఛార్జింగ్ పెట్టండి. ఎప్పుడు కూడా మీ ఫోన్ లో చార్జింగ్ ను 20 శాతానికి తగ్గకుండా చూసుకోండి. అప్పుడు మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.
* ఫోన్ ను చాలామంది వంద శాతం ఛార్జింగ్ చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఫోన్ ను వంద శాతం చార్జింగ్ చేయకూడదు. దాని వల్ల బ్యాటరీ లైప్ పాడవుతుంది.
* మీ ఫోన్లో 90 శాతం ఛార్జింగ్ పూర్తికాగానే.. ఛార్జింగ్ పెట్టడం ఆపేయండి. వంద శాతం ఛార్జింగ్ చేస్తే.. ఫోన్ ఓవర్ ఛార్జ్ అవుతుంది. దాని వల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. 90 శాతం కన్నా ఎక్కువ ఛార్జింగ్ ఉండకుండా చూసుకోండి.
* రాత్రిపూట నిద్రించే ముందు ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకోవడం చాలామంది చేస్తుంటారు. అది ఎంతమాత్రం మంచిది కాదు. 100 శాతం చార్జింగ్ అయ్యాక కూడా అలాగే ఛార్జర్ ఫోన్ కు పెట్టి ఉండటం వల్ల.. బ్యాటరీ లైఫ్ పాడవుతుంది.
* రాత్రంతా ఫోన్ కు చార్జింగ్ పెట్టి పడుకోవడం అనేది మంచిది కాదు. ఓ గంట, లేదా గంటన్నర ఛార్జింగ్ పెట్టి ఫ్లగ్ తీసేయాలి.
* మార్కెట్ లో ఫాస్ట్ ఛార్జర్ తో పాటు స్టాండర్డ్ ఛార్జర్ కూడా అందుబాటులో వున్నాయి. ఫాస్ట్ ఛార్జర్ కంటే స్టాండర్డ్ 5W adapter ను వాడితే బెటర్ అంటున్నారు. ఎందుకంటే.. బ్యాటరీ లైఫ్ ఎక్కువ సేపు రావాలంటే ఖచ్చితంగా స్టాండర్డ్ ఛార్జర్ మంచిది.
* స్మార్ట్ ఫోన్లలో power saving మోడ్ ఆప్షన్ వుంటుంది. ఫోన్ బ్యాటరీ తక్కువ అయినప్పుడు మాత్రమే చాలామంది power saving mode ను ఆన్ చేస్తుంటారు. దాన్ని ఎప్పుడూ ఆన్ లో ఉంచాలి. అప్పుడే ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం వస్తుంది.
* ఏ ఛార్జర్ దొరికితే ఆ ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టడం మంచిదికాదు. ఫోన్ కు వచ్చిన ఛార్జర్ తోనే చేయాలి. ఏదో అత్యవసర పరిస్థితుల్లో తప్పితే మిగతా టైంలో మీ ఫోన్ ఒరిజినల్ ఛార్జర్ తో నే ఛార్జి చేయాలి.
* మంచి బ్రాండ్ వున్న పవర్ బ్యాంక్ లు వాడాలి. పవర్ బ్యాంక్ వల్ల కూడా బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. అలాగే ఫోన్లో మీరు వాడే యాప్ లు ఒకసారి చెక్ చేసుకోండి. అవసరం లేని వాటిని డిలీట్ చేయండి. యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ కాకుండా.. ఆఫ్ చేస్తే మరీ మంచిది.
* మీ స్మార్ట్ ఫోన్లో డిస్ ప్లే మోడ్ చెక్ చేయండి. మీరు వాడేటప్పుడు 60 నుంచి 70 శాతం, మీరు నిద్రపోయేటప్పుడు ఫోన్ 20 నుంచి 30 శాతం డిస్ ప్లే వుంటే సరిపోతుంది.
Realme Narzo 50 5G: అదరగొట్టే ఫీచర్స్.. ఫాస్ట్ ఛార్జింగ్