OPPO F31 Series: ఒప్పో (OPPO) సంస్థ F31 సిరీస్ 5G ఫోన్‌లను సెప్టెంబర్ 15న భారత మార్కెట్‌లో లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ రాబోయే సిరీస్ కు డ్యూరబుల్ ఛాంపియన్ (Durable Champion) అనే ట్యాగ్‌లైన్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ ఫోన్‌ల వెనుక సర్కులర్ కెమెరా మోడెల్ డిజైన్ ఉంటుంది. ఈ కొత్త ఫోన్‌లు గోల్డ్, షాంపేన్ కలర్స్ లో అందుబాటులో ఉంటాయి. ఇది రేడియల్ ప్యాటర్న్ తో టెక్స్చర్డ్ బ్యాక్ ప్యానెల్ ను కలిగి ఉంటుంది.
OPPO F31 Pro ముఖ్య ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఇది హిమాలయన్ వైట్, జెమ్ స్టోన్ బ్లూ, ఫెస్టివల్ పింక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ 7.7mm మందం, 195 గ్రాముల బరువు ఉండనుంది. ఇందులో 7000mAh భారీ బ్యాటరీ ఉంది, ఇది 1830 ఛార్జింగ్ సైకిల్స్ కు మద్దతుగా రూపొందించబడింది. అంటే సుమారు 5 సంవత్సరాల పాటు స్టెబుల్ గా పని చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ద్వారా కేవలం 20 నిమిషాల్లో 42% ఛార్జ్ పూర్తి అవుతుంది. అలాగే ఇది 10W రివర్స్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ IP66 + IP68 + IP69 రేటింగ్స్ తో వస్తుంది. అందువల్ల దుమ్ము, ధూళి, నీరు నుండి పూర్తిగా నిరోధకత కలుగుతుంది. అంతేకాకుండా ఇది 360° Armour బాడీ డిజైన్ ఫోన్‌ను మరింత మన్నికైనదిగా, దృడత్వంగా నిలుపుతుంది.
Andhra Pradesh : ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలలు
ఇతర వివరాల ప్రకారం, OPPO F31 మోడల్ MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇదివరకు F29 సిరీస్‌లో ఉన్న Snapdragon 6 Gen 1 SoCని ప్రత్యామ్నాయంగా MediaTek SoCతో అప్గ్రేడ్ చేయబడింది. F31లో కూడా భారీ 7000mAh బ్యాటరీ ఉండగా, 80W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. OPPO F31 Pro మోడల్ Dimensity 7300 SoCను, 7000mAh బ్యాటరీను అందిస్తుంది. ఇది గత మోడల్‌లోని 6000mAh బ్యాటరీతో పోలిస్తే మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. OPPO F31 Pro+ మోడల్ ప్రత్యేకంగా శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 7 Gen 3 SoC తో వచ్చేస్తుంది. ఇది 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. అలాగే F31 Pro+ కూడా 7000mAh బ్యాటరీతో వస్తుంది.
OPPO F31 సిరీస్ అధికారికంగా సెప్టెంబర్ 15న భారతదేశంలో విడుదల కానుండగా, మిగతా స్పెసిఫికేషన్స్, ధరలు, ఫీచర్స్ వివరాలు లాంచ్ రోజు వెల్లడించే అవకాశముంది. ఈ సిరీస్ ముఖ్యంగా డ్యూరబిలిటీ, పెద్ద బ్యాటరీ ఫీచర్స్ పై ఫోకస్ చేస్తూ వినియోగదారులకు ఎక్కువ రోజులు మన్నిక వచ్చేలా చేయనుంది.
Cherlapally : వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్ కు తాళం వేసిన ముంబై పోలీసులు