Aadhaar Card: భారతదేశ పౌరులకు ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన పత్రం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆసుపత్రుల నుంచి బ్యాంకులు, కళాశాలలు, రేషన్ దుకాణాలు ఇలా ప్రతిచోటా ఆధార్ కార్డు తప్పనిసరి. భారత పౌరుడిగా నిరూపించుకోవడానికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. దాదాపు ప్రతి భారతీయుడికి ఆధార్ ఉంది. అధికారిక గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందుకే అలాంటి ఆధార్ కార్డులోని వివరాలను సరిగ్గా సరిచూసుకోవాలి. ఏవైనా తప్పులు ఉన్నా వాటిని సరిదిద్దుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
అయితే ఆధార్ కార్డులో మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీని మార్చుకోవాలని, అప్‌డేట్ చేయాలని చూస్తున్నారా.. అయితే ఇదే సరైన సమయం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UDAI) తన ఆన్‌లైన్ పోర్టల్‌లో జూన్ 14 వరకు ఉచితంగా ఈ సేవను అందిస్తోంది. భారతీయులు ఎటువంటి ఖర్చు లేకుండా ఆధార్‌ను నవీకరించడానికి ఈ సేవను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంటే మీరు ఆధార్ లో ఏదైనా తప్పులుంటే మార్చుకోవడానికి కేవలం ఇక నాలుగు రోజులే టైం ఉందన్నమాట. కాగా.. ఆధార్‌ను రిజిస్టర్ ఆధార్ సెంటర్లలో మునుపటిలా అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే దానికి రూ.50 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
ఇలా చేయండి..
ఆధార్ ఐడి 10 సంవత్సరాల క్రితం పొందినట్లయితే, ఆధార్ లింక్ చేయబడిన సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి పోర్టల్‌లో అనేక డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
1. myAadhaar పోర్టల్‌కి లాగిన్ చేయండి. తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి, డాక్యుమెంట్ అప్‌డేట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. దీని కోసం మీకు మీ ఆధార్ నంబర్ మరియు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ అవసరం.
2. ఇప్పటికే ఉన్న వివరాలను సరి చేసి, ఆపై హైపర్‌లింక్‌పై క్లిక్ చేయండి.
3. ఐడెంటి ఫ్రూఫ్.. అడ్రస్ ఫ్రూఫ్ సెలెక్ట్ చేసుకోండి, స్కాన్ చేసిన పత్రాలను వెంటనే అప్‌లోడ్ చేయండి. అవసరమైన పత్రాల వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
4. అప్‌డేట్ ప్రక్రియ యొక్క దశను తెలుసుకోవడానికి 14-అంకెల అప్‌డేట్ అభ్యర్థన నంబర్ వస్తుంది.
5. మొత్తం అప్‌డేట్ అయిన తర్వాత, కొత్త ఆధార్ కార్డ్ జనరేట్ చేయబడుతుంది. ఈ అవకాశం మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉన్నందున వెంటనే ఆధార్‌ను అప్‌డేట్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Nagaland Govt: కుక్క మాంసం అమ్మకానికి ఆ రాష్ట్రంలో గ్రీన్ సిగ్నల్