OnePlus – Bhagwati: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) సంస్థ భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ‘భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్’ (BPL) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, వన్‌ప్లస్ టాబ్లెట్లు ఇకపై భారతదేశంలోనే అసెంబుల్ చేయబడతాయి. భగవతి ప్రొడక్ట్స్ గ్రేటర్ నోయిడాలోని ఫ్యాక్టరీలో ఈ వన్‌ప్లస్ టాబ్లెట్ల ఉత్పత్తిని చేపట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రారంభ దశలో వన్ ప్లస్ ప్యాడ్ 3, వన్ ప్లస్ ప్యాడ్ లైట్ మోడళ్లను తయారు చేయనున్నారు.
ఇప్పటివరకు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు మాత్రమే భారతదేశంలో తయారు అవుతుండగా.. ఈ కొత్త కలియక ద్వారా మొదటిసారి టాబ్లెట్స్ ఉత్పత్తి కూడా దేశీయంగా ప్రారంభం కానుంది. ఇది వన్‌ప్లస్ “Made in India” పోర్ట్‌ఫోలియోను స్మార్ట్‌ఫోన్లకు మించి విస్తరించే ఆలోచంలో ప్లాన్ చేసినట్లుగా కనపడుతోంది. ఈ ప్రయత్నం వన్‌ప్లస్ దీర్ఘకాలిక భారత మార్కెట్ లో కొనసాగింపుకు, “ప్రాజెక్ట్ స్టార్ లైట్” అనే స్థానిక తయారీ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యానికి అనుగుణంగా సాగనుంది.
ZPTC Elections :ఎంపీ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి కౌంటర్
మరోవైపు వన్‌ప్లస్ ‘ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్’తో కలిసి భారతదేశంలో AIoT ఉత్పత్తులను (OnePlus Bullets Wireless Z3 తో ప్రారంభమై) తయారు చేయడం కూడా ప్రారంభించింది. భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్ కోసం వన్‌ప్లస్ టాబ్లెట్ల ఉత్పత్తి, స్థానికీకరణ పనులను భగవతి ప్రొడక్ట్స్ గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో నిర్వహిస్తుంది. ఈ భాగస్వామ్యంపై వన్‌ప్లస్ ఇండియా CEO రోబిన్ లియూ మాట్లాడుతూ.. BPL తో భాగస్వామ్యం మా తయారీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంలో, అలాగే కనెక్టెడ్ ఎకోసిస్టమ్‌ను విస్తరించడంలో ఒక కీలక మైలురాయిగా అభివర్ణించారు. టాబ్లెట్ ఉత్పత్తిని స్థానికంగా చేపట్టడం ద్వారా భారత మార్కెట్ పట్ల మా నిబద్ధతను బలోపేతం చేస్తున్నాం. ఇది భారతదేశానికి, భారత వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు తీసుకున్న దీర్ఘకాలిక వ్యూహాత్మక అడుగని ఆయన తెలిపారు.
