OnePlus – Bhagwati: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) సంస్థ భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ‘భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్’ (BPL) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, వన్‌ప్లస్ టాబ్లెట్లు ఇకపై భారతదేశంలోనే అసెంబుల్ చేయబడతాయి. భగవతి ప్రొడక్ట్స్ గ్రేటర్ నోయిడాలోని ఫ్యాక్టరీలో ఈ వన్‌ప్లస్ టాబ్లెట్ల ఉత్పత్తిని చేపట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రారంభ దశలో వన్ ప్లస్ ప్యాడ్ 3, వన్ ప్లస్ ప్యాడ్ లైట్ మోడళ్లను తయారు చేయనున్నారు.…