OnePlus Nord 3 Image Leake: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘వన్‌ప్లస్’కి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వన్‌ప్లస్ సంస్థ నిత్యం సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ కస్టమర్లను తమవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల సూపర్ 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల విడుదల చేసింది. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 11 5జీ (OnePlus 11 5G)ని భారతీయ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఇక ఈ ఏడాది వన్‌ప్లస్ మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఆ స్మార్ట్‌ఫోన్ పేరు ‘వన్‌ప్లస్ నార్డ్ 3’ (OnePlus Nord 3).
OnePlus Nord 3 Launch:
భారతదేశం మరియు యూరప్ వంటి మార్కెట్లలో వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబడుతుందని సమాచారం తెలుస్తోంది. జూలైలో ఈ ఫోన్‌ను పరిచయం చేయనున్నారని సమాచారం. గత మార్చిలో చైనాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ ఏస్ 2వీ (OnePlus Ace 2V)కి ఈ ఫోన్ సక్సెసర్‌గా రానుంది. అయితే ఈ ఫోన్ రిలీజ్ కంటే ముందే ఫొటోస్ బయటకు వచ్చాయి. వన్‌ప్లస్ నార్డ్ 3 ఫొటోస్ ప్రకారం లీకైన వివరాలు ఓసారి చూద్దాం.
OnePlus Nord 3 Features:
లీకైన ఫొటోస్ ప్రకారం… వన్‌ప్లస్ నార్డ్ 3లో పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఫోన్ ముందు భాగంలో ఇన్‌స్టాల్ చేయబడుతుంది. వెనుక భాగంలో రెండు ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్లు మరియు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఎగువ మూలలో మైక్రోఫోన్, ఒక IR బ్లాస్టర్ మరియు స్పీకర్ ఉన్నాయి. అంతేకాదు సిమ్ స్లాట్, మైక్రోఫోన్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ మరియు స్పీకర్ ఉన్నాయి. వాల్యూమ్ బటన్స్ ఫోన్ ఎడమ వైపున ఉన్నాయి. కుడి వైపున స్లయిడర్ మరియు పవర్ బటన్ ఉన్నాయి.
OnePlus Nord 3 Camera:
వన్‌ప్లస్ నార్డ్ 3లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మరియు ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంది. ట్రిపుల్ కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో ఫీచర్ చేయబడింది. అదనంగా 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా అందుబాటులో ఉంది.
Also Read: Honda Dio Launch: కొత్త స్కూటర్‌ని విడుదల హోండా.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!
OnePlus Nord 3 Battery:
వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ 6.74-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2772 x 1240 పిక్సెల్‌ల FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ డిస్‌ప్లే వెనుక 9000 చిప్‌సెట్ ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 16 GB RAMతో వస్తుంది. ఇది 128GB లేదా 256GB స్టోరేజ్ నిల్వను కలిగి ఉంటుంది.18W ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది.
Also Read: Earthquake In Jammu: జమ్మూకశ్మీర్‌లో భూకంపం.. ఉత్తర భారతదేశం అంతటా ప్రకంపనలు! భయాందోళనలో ప్రజలు