చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. చైనాలో ఇప్పటికే రిలీజ్ అయిన ‘వన్‌ప్లస్ 15’ భారతదేశంలో గురువారం లాంచ్ అయింది. భారతదేశంలో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12GB+256GB వేరియంట్ ధర రూ.72,999గా.. 16GB+512GB వేరియంట్ ధర రూ.79,999గా కంపెనీ నిర్ణయించింది. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లపై అదనంగా రూ.4,000 తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభమయ్యాయి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3ని ఉచితంగా కంపెనీ ఇస్తోంది. వన్‌ప్లస్ 15ను గత రెండు వారాలుగా వాడిన ఓ యూసర్ తన రివ్యూను పంచుకున్నాడు.
డిస్‌ప్లే:
వన్‌ప్లస్ 13తో పోలిస్తే.. వన్‌ప్లస్ 15 డిజైన్ దాదాపు పూర్తిగా మార్చబడింది. కెమెరా మాడ్యూల్ కాస్త పైకి ఇచ్చారు. ముందు భాగం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో వచ్చింది. ఇది ఏరోస్పేస్-గ్రేడ్ నానో-సిరామిక్ మిడ్-ఫ్రేమ్‌తో కూడిన అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్. ఇది ఇతర స్మార్ట్‌ఫోన్‌ల కంటే భిన్నంగా ఉంటుంది. క్రిస్టల్ గ్లాస్ వెనుక ప్యానెల్ మరింత ప్రీమియం లుక్ ఇస్తుంది. బెజెల్స్ చాలా సన్నగా ఉంటాయి. 6.78-అంగుళాల క్యూహెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే డిస్‌ప్లే ఉంది. ఇది 1.5K డిస్‌ప్లే, 165Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. 1.5mm బెజెల్స్ వీక్షణను పెంచుతాయి. నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ 3000. ఇది బహిరంగ ప్రదేశాల్లో కూడా డిస్‌ప్లే వాడకాన్ని సులభతరం చేస్తుంది. గేమింగ్ అనుభవం ఇంకా చాలా బాగుంది.
ప్రాసెసర్:
భారతదేశంలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో లాంచ్ అయిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఇదే. ఇది 16GB RAM ఆప్షన్‌తో వస్తుంది కాబట్టి సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ అత్యంత వేగవంతమైన ఆండ్రాయిడ్ ప్రాసెసర్. పనితీరులో ఇది iPhone 17ను అధిగమిస్తుంది. ఫోన్‌లో గ్లేసియర్ డ్యూయల్-లేయర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. గేమింగ్ సమయంలో కూడా ఫోన్ వేడెక్కడాన్ని ఇది నిరోధిస్తుంది. COD, BGMI వంటి గేమ్‌లను గంటల తరబడి ఆడినా ఫోన్ హీట్ కాదు. మల్టీ టాస్కింగ్ అయితే అద్భుతం. నా దృష్టిలో వన్‌ప్లస్ 15 విన్నర్.
కెమెరా:
వన్‌ప్లస్ 15 ఫోన్‌లో థ్రోట్లింగ్, ఓవర్ హీటింగ్ సమస్యలు లేవు. అలాగే గ్రీన్ లైన్‌లు కూడా కనపడలేదు. ఫోన్‌లో గ్రీన్ లైన్ సమస్య తలెత్తితే.. కంపెనీ దానిని ఉచితంగా భర్తీ చేస్తుందని లేదా రిపేర్ చేస్తుందని వన్‌ప్లస్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇందులో మూడు 50-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ జూమ్ 3.5x వరకు సపోర్ట్ చేస్తోంది. అన్ని లెన్స్‌లు చాలా బాగా పనిచేస్తాయి. పగటిపూట ఫోటోలు బాగా వస్తున్నాయి. కొత్త పెరిస్కోప్ లెన్స్ స్పష్టమైన జూమ్ షాట్‌లను అందిస్తుంది. నైట్ ఫోటోగ్రఫీ అద్భుతం. 8Kలో వీడియోను కూడా రికార్డ్ చేయవచ్చు. 4K, 8K రెండూ డాల్బీ విజన్‌కు మద్దతు ఇస్తాయి. ఇది సినిమాటిక్ వ్యూని అందిస్తుంది. 32 మెగాపిక్సెల్ ముందు కెమెరా 4Kలో వ్లాగ్ చేయడానికి అనుమతిస్తుంది.
బ్యాటరీ:
వన్‌ప్లస్ 15 ఫోన్ 7,300mAh బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ సిలికాన్-కార్బన్ సెల్‌ను ఉపయోగించింది. దాంతో ఫోన్ బరువు తక్కువే. బ్యాటరీ రెండు రోజుల వరకు ఉంటుంది. బాక్స్‌లో ఛార్జర్ కూడా వస్తుంది. ఇది 120W వరకు వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్‌ను 15 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేయవచ్చు. పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు అరగంట పడుతుంది. 50W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇది చాలా వేగంగా ఉంటుంది. ఫోన్ రివర్స్, బైపాస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. గేమింగ్ సమయంలో బైపాస్ ఛార్జింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం 5-6 నిమిషాలు ఛార్జింగ్ పెట్టి 4-5 గంటల పాటు వీడియోలను చూడవచ్చు.
ఏఐ ఫీచర్స్:
వన్‌ప్లస్ 15 అనేక ఏఐ ఫీచర్లతో వస్తుంది. కొన్ని రోజువారీ జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. AI గ్యాలరీ, వాయిస్ AI ఉంటుంది. AI గేమింగ్ బూస్ట్ మెరుగైన పనితీరును అందించడానికి అనుగుణంగా ఉంటుంది. అయితే కొన్ని ఫీచర్స్ మాత్రం పరిపూర్ణంగా లేవు. మొత్తం మీద వన్‌ప్లస్ 15 మంచి పర్ఫామెన్స్ ఇస్తుంది. లుక్, పనితీరు విషయంలో ఇతర ఫ్లాగ్‌షిప్‌ల కంటే బెస్ట్. ఫైనల్లీ వన్‌ప్లస్ 15 మంచి ఆప్షన్.