Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Oneplus 10 Oneplus Is A New Phone That Comes With A Creepy Processor

OnePlus 10: అదిరిపోయే ప్రాసెసర్‌తో కొత్త ఫోన్..ఇదొస్తే మిగతా ఫోన్లకు కష్టాలు తప్పవు

Published Date :June 12, 2022 , 5:21 pm
By Lakshmi Narayana
OnePlus 10: అదిరిపోయే ప్రాసెసర్‌తో కొత్త ఫోన్..ఇదొస్తే మిగతా ఫోన్లకు కష్టాలు తప్పవు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఓవల్‌టైన్ అనే కోడ్ నేమ్ ఉన్న వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతోంది. ఇది వన్‌ప్లస్ 10 లేదా వన్‌ప్లస్ 10టీ అయ్యే అవకాశం ఉంది. దీని లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ రెండర్లు, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాసెసర్‌తో ఇంతవరకు ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ కాలేదు. అయితే ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి.వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందించనున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ 10 సిరీస్‌లో ఇప్పటికే వన్‌ప్లస్ 10 ప్రో లాంచ్ అయింది.

ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ దీనికి సంబంధించిన రెండర్లు, స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ 10 లేదా వన్‌ప్లస్ 10టీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఫోన్ రెండర్లలో దీన్ని బ్లాక్ కలర్‌లో చూడవచ్చు. వెనకవైపు వన్‌ప్లస్ బ్రాండింగ్ కూడా చూడవచ్చు. హోల్ పంచ్ డిజైన్, ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉన్నాయి.

వన్‌ప్లస్ 10 స్పెసిఫికేషన్లు (అంచనా)..

ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది.

వన్‌ప్లస్ 10 ప్రో మార్చిలో మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.66,999 నుంచి ప్రారంభం కానుంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Latest Mobiles
  • Latest Technology News
  • OnePlus
  • OnePlus 10 Pro

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions