OnePlus 10: అదిరిపోయే ప్రాసెసర్‌తో కొత్త ఫోన్..ఇదొస్తే మిగతా ఫోన్లకు కష్టాలు తప్పవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవల్‌టైన్ అనే కోడ్ నేమ్ ఉన్న వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతోంది. ఇది వన్‌ప్లస్ 10 లేదా వన్‌ప్లస్ 10టీ అయ్యే అవకాశం ఉంది. దీని లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ రెండర్లు, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాసెసర్‌తో ఇంతవరకు ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ కాలేదు. అయితే ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి.వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందించనున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ 10 సిరీస్‌లో ఇప్పటికే వన్‌ప్లస్ 10 ప్రో లాంచ్ అయింది.
ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ దీనికి సంబంధించిన రెండర్లు, స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ 10 లేదా వన్‌ప్లస్ 10టీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఫోన్ రెండర్లలో దీన్ని బ్లాక్ కలర్‌లో చూడవచ్చు. వెనకవైపు వన్‌ప్లస్ బ్రాండింగ్ కూడా చూడవచ్చు. హోల్ పంచ్ డిజైన్, ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉన్నాయి.
Also Read
- Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
- OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
- Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
- Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
వన్‌ప్లస్ 10 స్పెసిఫికేషన్లు (అంచనా)..
ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది.
వన్‌ప్లస్ 10 ప్రో మార్చిలో మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.66,999 నుంచి ప్రారంభం కానుంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?